Trends

ఫిక్సింగ్ వాదనలతో రాజస్థాన్ కలకలం.. అసలేమైంది?

ఐపీఎల్‌ 2025లో ఓ మ్యాచ్‌ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం చెందడం తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా చేజార్చుకుంది? ఆఖరి ఓవర్లలో నడిచిన విధానం ఏమిటి? అనే సందేహాలతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జయదీప్ బిహానీ ఫిక్సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫిక్సింగ్ జరిగినట్లు బిహానీ చేసిన కామెంట్స్ వెంటనే వివాదానికి దారితీశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. బిహానీ మాటలు నిరాధారమని, అవి జట్టు ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రీడా శాఖా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. 

ఈ ఆరోపణలు బీసీసీఐ, స్పోర్ట్స్ కౌన్సిల్, మరియు రాయల్స్ యాజమాన్యంపై ప్రభావం చూపేలా ఉన్నాయని రాయల్స్ అధికార ప్రతినిధి దీప్ రాయ్ తెలిపారు. ఇదే అంశంపై జట్టు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు క్రికెట్‌ను అవమానించే ప్రయత్నమేనని స్పష్టం చేశాయి. అభిమానులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఆటగాళ్లపై అనవసరంగా అవాంఛిత నీడలు పడేలా చేస్తాయన్నారు. 

ఈ అంశంపై సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకునే విషయాన్ని కూడా జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 గెలవడంతో 4 పాయింట్లతో నిలిచింది. ఈ ఒత్తిడిలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ జట్టు పునరుత్తానం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో మెదులుతోంది. మరి ఫిక్సింగ్ అనుమానాల నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

This post was last modified on April 22, 2025 7:12 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago