ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన టెస్లా భారత్‌కు రావడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయి–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ టెస్లా కార్ భారీ క్యామోఫ్లాజ్‌తో ప్రయాణించడాన్ని కొందరు ట్రాఫిక్ ప్యాసింజర్లు గుర్తించగా, దాని వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది కేవలం టెస్ట్ డ్రైవ్ కాదన్న భావన బలపడుతోంది. భారత్ మార్కెట్లో ప్రవేశానికి టెస్లా పక్కా ప్లాన్ చేస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ కారు టెస్లా ‘మోడల్ వై’కి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని గుర్తించబడింది. అంతర్జాతీయంగా ఈ మోడల్‌ను ‘జూనిపర్’ కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. దీని రూపకల్పనలో సరికొత్త డిజైన్ అంశాలు కనిపించగా, ముఖ్యంగా సీ-షేప్ టెయిల్ లైట్లు, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, గ్లాస్ రూఫ్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో కనిపించాయి. అంటే, ఇది సాధారణ మోడల్ కాదని స్పష్టమవుతోంది.
గ్లోబల్ వెర్షన్ స్పెసిఫికేషన్ల ప్రకారం, మోడల్ వై ఓ ఆల్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ. దీని టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో చేరుకుంటుంది. అంతేకాదు, 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక ప్రయాణికుల కోసం 8 అంగుళాల సెకండరీ స్క్రీన్ వంటి టెక్ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది.
అయితే భారత్‌లో విడుదలయ్యే మోడల్ స్పెసిఫికేషన్లలో కొంత భిన్నత ఉండొచ్చని వాహన పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధర, బ్యాటరీ రేంజ్, ఫీచర్లు భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా స్థానికీకరణ జరిపే అవకాశముంది. అంతేకాకుండా, చైనా లేదా ఇండోనేషియా అసెంబ్లీ యూనిట్ల నుంచి వాహనాలు దిగుమతి చేసే వ్యూహాన్ని టెస్లా అనుసరించవచ్చని టాక్.
This post was last modified on April 17, 2025 4:04 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…