ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
ఈ స్పోర్ట్స్ సిటీలో అన్ని రకాల క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌లకు తగినంతగా లేదన్న అభిప్రాయంతో, 25,000 మంది కూర్చునే సామర్థ్యంతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించింది.
ఈ నిర్మాణానికి కావాల్సిన మొత్తం వ్యయంలో 60 శాతాన్ని బీసీసీఐ భరిస్తుందని, మిగతా 40 శాతాన్ని ఏసీఏ సమకూర్చనుందని సమాచారం. స్టేడియం పూర్తయిన తర్వాత ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి మరింత క్రీడా ప్రోత్సాహం లభించనుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్‌పై పరిశీలన కోసం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కలిసి ప్రదేశాన్ని సందర్శించారు. స్పోర్ట్స్ సిటీ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతి భూమికి సరైన పరిహారం చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ స్పోర్ట్స్ సిటీ పూర్తి అయితే, ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి ఒక గొప్ప కేంద్రంగా నిలిచే అవకాశముంది. ఒలింపిక్ స్థాయి సదుపాయాలతో, అత్యాధునికంగా ఉండే ఈ క్రీడా నగరం అమరావతికి మరింత గౌరవాన్ని తీసుకురానుంది. ఇది క్రీడాకారులకు శిక్షణా కేంద్రంగా మారే క్రమంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.
This post was last modified on April 15, 2025 9:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…