26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై కొంతకాలంగా న్యాయపోరాటం చేసిన ఈ నిందితుడు, చివరకు భారత్‌కి రావాల్సి వచ్చింది. ఆయనను ఢిల్లీకి తీసుకొచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
రాణా బాల్యమిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ ఇప్పటికే ఆరోపించింది. అంతేకాదు, దాడుల అనంతరం రాణా “భారతీయులు దీనికి అర్హులే… వాళ్లకు ఇలా జరగాల్సిందే” అన్నట్లుగా హెడ్లీతో మాట్లాడినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలిచివేశాయి.
తహవ్వుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టరుగా పనిచేసిన తరువాత కెనడా పౌరుడిగా మారి అమెరికాలో వీసా కన్సల్టెంట్‌గా వ్యాపారం ప్రారంభించాడు. అదే వ్యాపారాన్ని ముసుగుగా ఉపయోగించి హెడ్లీకి మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం ముంబైలోని టార్గెట్లను గుర్తించి దాడికి మార్గం సిద్ధం చేశారు.
ఈ కేసులో రాణా పేరును తొలిసారిగా వెల్లడించిన సమయంలోనే అమెరికా అతడిపై పలు కేసులు నమోదు చేసింది. భారత్ మాత్రం సుదీర్ఘ న్యాయప్రక్రియ ద్వారా ఆయనను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేసింది. చివరికి, అమెరికా సుప్రీం కోర్టు ‘అప్పగింతకు ఎలాంటి అడ్డంకులు లేవు’ అని తేల్చడంతో అతడి ప్రయాణం భారత్ దిశగా సాగింది.
హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, “ఇది 26/11 బాధితుల పక్షాన న్యాయం జరగే ఒక ప్రధాన ప్రక్రియ,” అన్నారు. ఎన్ఐఏ కూడా ఈ విచారణలో ముంబై దాడుల వెనుక ఉన్న అంతర్గత కుట్రలు బయటపడతాయని ఆశిస్తోంది. ఇక తహవ్వుర్ రాణా విచారణ ఏ మేరకు నూతన ఆధారాలు వెలుగులోకి తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on April 11, 2025 6:59 pm
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…
"విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…
తన పాటలు, ట్యూన్లు ఎవరు వాడుకున్నా వాళ్ళను విడిచిపెట్టే విషయంలో రాజీపడని ధోరణి ప్రదర్శించే ఇళయరాజా ఈసారి గుడ్ బ్యాడ్…