ఐపీఎల్ 4వ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట్లో ఎంత కిక్ ఇచ్చిందో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో నుంచి చివరి వరకు అదే రేంజ్ థ్రిల్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయం ఆల్ టైమ్ బెస్ట్ చేసింగ్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మార్ష్ (72) – పూరన్ 75 (30) ధాటికి లక్నో 209 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో దిగిన ఢిల్లీకి మొదట్లోనే ఊహించని షాక్ తగిలింది.
7 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఒక్కొక్కరు వెనుదిరిగారు. కానీ చివర్లో అషుతోష్ (66) పంత్ ఆశను తగలబెట్టేశాడు. మధ్యలో అక్షర్ (22) ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపించినా వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తరువాత సీనియర్ ప్లేయర్ డూప్లెసిస్ (29) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో ఢిల్లీ ఓటమి చెందినట్లే అని అందరు అనుకున్నారు. కానీ స్టబ్స్ – అషుతోష్ శర్మ జోడి మంచి భాగస్వామ్యంతో బలాన్ని ఇచ్చింది.
కానీ వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన అనంతరం స్టబ్స్(34) కూడా అవుట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పేసింది. ఇక ఆ తరువాతే అసలు ఆట మొదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి మొదటి మ్యాచ్ ఆడిన విప్ రాజ్ నిగమ్(39) లక్నో బౌలర్లకు భయం పుట్టించాడు. కానీ అతను కీలక సమయంలో అవుట్ అవ్వడంతో చివర్లో అషుతోష్(66) మ్యాచ్ ను భయం లేకుండా ఫినిష్ చేశాడు. చివర్లో 9 వికెట్లు పడ్డప్పుడు కాస్త టెన్షన్ పెట్టినప్పటి అషుతోష్ కు స్ట్రైక్ రావడంతో మ్యాచ్ ను సిక్సర్ తో ఫినిష్ చేశాడు.
This post was last modified on March 25, 2025 5:46 am
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు చేసే విషయంలో తగినంత సమయం దొరక్క బ్యాలన్స్…
ఉగాది, రంజాన్ పండగల లాంగ్ వీకెండ్ మొదటి అంకానికి తెరలేచింది. మార్చిలో కోర్ట్ తప్పించి చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలేవీ…
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే... ఆ సామెత కాస్తా... రాజు తలచుకుంటే…
ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది…
ఇటీవలే పెళ్లి చేసుకుని శ్రీమతిగా మారిన కీర్తి సురేష్ కు బాలీవుడ్ డెబ్యూ 'బేబీ జాన్' మాములు షాక్ ఇవ్వలేదు.…
రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి లాంటి చిత్రాలతో ఒకప్పుడు తిరుగులేని బ్లాక్ బస్టర్లు అందించిన దర్శకుడు ఏఆర్…