Trends

OPT స్కామ్‌.. అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త సమస్య!

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు OPT (ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం. అంటే, వారు తమ చదువు పూర్తయ్యాక 1 నుంచి 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి మొత్తం 3 ఏళ్లు ఈ అవకాశం ఉంటుంది. కానీ, తాజాగా USCIS (యునైటెడ్ స్టేట్స్ సిటీజేన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త పాలసీ కారణంగా OPT స్కామ్‌లో ఇరుక్కున్న విద్యార్థులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

OPT స్కామ్ ఎలా జరుగుతుందంటే, కొన్ని కన్సల్టింగ్ కంపెనీలు విద్యార్థులకు మంచి ఉద్యోగం ఇస్తామంటూ నమ్మిస్తాయి. ఆ తర్వాత, ఉద్యోగం కోసం ఇంకా కొంత శిక్షణ కావాలని చెబుతూ డబ్బు వసూలు చేస్తాయి. కానీ, అసలు పనిచేయడానికి ఎలాంటి ప్రాజెక్ట్‌లు ఇవ్వకుండా, కేవలం డాక్యుమెంట్స్‌లో మాత్రమే ఉద్యోగం ఉన్నట్లు చూపిస్తాయి. ఈ క్రమంలో కొందరు ఇల్లీగల్ గా పార్ట్ టైమ్ జాబ్స్ లలో కొనసాగుతూ ఉంటారు.

ఇక OPT స్కామ్ పై అనుమానాల వలన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సంస్థ గుర్తించి, ఆ కంపెనీలపై దాడులు చేసింది. తర్వాత, ఆ కంపెనీలలో పని చేసిన విద్యార్థుల పేర్లను USCIS తన లిస్టులో చేర్చింది. ఈ నేపథ్యంలో, చాలా మంది భారతీయ విద్యార్థులు OPT పూర్తయి, ఇప్పుడు H-1B వీసాపై ఉన్నప్పటికీ, భారత్ నుంచి తిరిగి అమెరికాకు వెళ్లినప్పుడు వారి వీసాలను రద్దు చేస్తున్నారు. అమెరికాలోని పలు ఇమ్మిగ్రేషన్ అధికారుల టీమ్స్ వారి పేరు OPT స్కామ్‌లో ఉందని చెబుతూ, వారిని తిరిగి భారత్‌కు పంపేస్తున్నాయి. అంతేకాదు, అలాంటి విద్యార్థులకు భవిష్యత్తులో అమెరికా వీసా కూడా ఇవ్వకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడటానికి, విద్యార్థులు తక్షణమే న్యాయ సహాయం తీసుకోవాలి. తమ పేరు USCIS రికార్డుల నుండి తొలగించుకోవడానికి లీగల్ ప్రొసెస్ ద్వారా ముందుకు వెళ్లాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, OPT స్కామ్ కారణంగా విద్యార్థులు, యువ ఉద్యోగులు తమ అమెరికా కెరీర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. తప్పుడు కంపెనీలలో పనిచేయడం వల్ల ఎంతటి ఇబ్బందులు రావొచ్చో ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా మారింది. కనుక, OPT కోసం పని చేసే ముందు ఎప్పుడూ ధృవీకరించిన కంపెనీలను మాత్రమే ఎంచుకోవడం చాలా ముఖ్యం.

This post was last modified on March 6, 2025 11:08 am

Share

Recent Posts

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

22 minutes ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

52 minutes ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

3 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

4 hours ago