కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున అత్యవసర సేవలు మినహా దాదాపుగా అన్ని రంగాలు షట్ డౌన్ అయ్యాయి. ఆసుపత్రులు, నిత్యావసరాలతో పాటు బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వగా….మరోవైపు బ్యాంకుల్లో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కాలం వెళ్లదీయాలని చాలామంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు.
జన్ ధన్ ఖాతాల్లో వేసిన రూ.500 తీసుకోవడం కోసం మొదలు…రకరకాల లావాదేవీల కోసం జనాలు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకు సేవల సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుదించారు. దీంతో, బ్యాంకుల ముందు తాకిడి మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మే నెలలో ఆ తాకిడి మరింత పెరిగే అవకాశముంది.
ఎందుకంటే మే నెలలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా బ్యాంకింగ్ నిబంధనల్లో సోషల్ డిస్టెన్స్..ఇతరత్రా నిబంధనలు యధావిధిగా కొనసాగే అవకాశముంది. దీంతో, మే నెలలో బ్యాంకు లావాదేవీలు చేసేవారు ఏఏ తేదీల్లో సెలవులు వచ్చాయో ఓ లుక్కేయడం మంచింది. మే నెలలో రెండు శనివారాలు, ఐదు ఆదివారాలు, బుద్ధ పూర్ణిమ, రంజాన్, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మే 1), మే 7 – బుద్ద పూర్ణిమ ఇలా సెలవలు రాబోతున్నాయి. వీటితోపాటు స్టాక్ మార్కెట్లు మే 1, మే 25న బంద్ అవుతాయి.
బ్యాంకుల సెలవుల జాబితా ఇదే
మే 1 – అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం
మే 3 – ఆదివారం
మే 7 – బుద్ద పూర్ణిమ
మే 9 – రెండో శనివారం
మే 10 – ఆదివారం
మే 17 – ఆదివారం
మే 23 – నాలుగో శనివారం
మే 24 – ఆదివారం
మే 25 – రంజాన్
మే 31 – ఆదివారం
This post was last modified on April 29, 2020 7:06 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…