మరణం ఎలా వస్తుందో ఊహించడం కష్టమనే మాటను ఈ ఘటన రుజువు చేస్తుంది. ప్రముఖ యువ పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య.. రెప్పపాటులో కన్నుమూశారు. త్వరలోనే జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అదే ఆటలో ప్రాణాలు కోల్పోయారు. ఆటగదరా శివా! అన్నట్టుగా యశ్తికా మరణం చోటు చేసుకోవడం చిత్రం. 270 కిలోల బరువు ఎత్తేందుకు శిక్షణ తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆ బరువు తన మెడపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. దీనికిసంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌కు చెందిన యశ్తికా ఆచార్యకు 17 సంవత్సరాలు. ఆది నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో దూసుకుపోయారు. జూనియర్ నేషనల్ గేమ్స్‌లోనూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. త్వరలోనే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 250 కిలోలకు పైగా బరువునుఎత్తే ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. దీనికిగాను ఆమెనిరంతరం సాధన చేస్తున్నారు. బుధవారం యధావిధిగా ప్రాక్టీస్ ప్రారంభించిన యశ్తికా ఆచార్య.. ఏకంగా 270 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె ట్రైనర్ కూడా ఆమెకు మెళకువలు నేర్పారు.
మొత్తానికి 270 కిలోల బరువును భుజాలపైకి ఎత్తుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే.. అంత బరువును.. మోయ లేక.. కిందకు వాలిపోయారు. ఈ క్రమంలో 270 కిలోల వెయిట్ యశ్తిక మెడపై నుంచి తల మీదుగా కిందకు జారింది. దీంతో నాడులు పూర్తిగా నలిగిపోయి.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ట్రైనర్‌కు సైతం కుడి భుజానికి గాయమైంది. ఆ వెంటనే యశ్తికాను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమెమృతి చెందిన వైద్యులు తెలిపారు. పోస్టు మార్టమ్ అనంతరం.. ఆమె మృత దేహాన్నికుటుంబానికి అప్పగించారు. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో విషాదాన్ని నింపింది.
This post was last modified on February 19, 2025 7:59 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…