నాగపూర్‌కు చెందిన ఆకాష్ హోలే, దివ్య లోహకారే హోలే దంపతులు కేవలం 400 చదరపు అడుగుల గదిలో ఎటువంటి నేల లేకుండా, కేవలం గాలి, మబ్బుగా ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యమైన కుంకుమను పెంచుతున్నారు. సాధారణంగా చల్లని కాశ్మీర్ వాతావరణంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే కుంకుమను, భారతదేశంలోని అత్యంత వేడికాలిన నగరాల్లో ఒకటైన నాగపూర్‌లో పెంచడం నిజంగా ఒక అద్భుతం. ఈ వినూత్నమైన ఏరోపోనిక్ టెక్నిక్ ద్వారా వార్షికంగా 50 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
2020లో వారు కేవలం 80 చదరపు అడుగుల ఎయిరోపోనిక్ యూనిట్‌తో తమ ఇంటి టెర్రస్‌పై ప్రయోగం ప్రారంభించారు. మొదట కేవలం ఒక కిలో కుంకుమ గింజలు తెచ్చి కొద్దిగ్రాముల ఉత్పత్తి చేసుకున్నారు. అయితే, అందులో విజయాన్ని చూసిన తర్వాత 350 కేజీల గింజలను నాటారు. దాంతో 1.6 కిలోల కుంకుమ పంట వచ్చిందని ఆకాష్ తెలిపారు. ప్రస్తుతం, హింగ్నాలో ఉన్న తమ ఇంట్లో 400 చదరపు అడుగుల గదితో సహా, 480 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ వ్యవసాయాన్ని విస్తరించారు.
వారి విజయగాధ ఇక్కడే ఆగలేదు. ఈ పద్ధతి గురించి ఇతరులను కూడా ప్రోత్సహించడం ప్రారంభించారు. ఇప్పటివరకు 150 మందికి శిక్షణ ఇచ్చి, వారిలో 29 మంది సొంత యూనిట్లను నెలకొల్పడానికి సహాయం చేశారు. శిక్షణ పొందిన ప్రతి వ్యక్తి నుంచి వారు రూ. 15,000 వసూలు చేస్తారు. ఆపై ఆ ఉత్పత్తిని స్వయంగా కొనుగోలు చేసి ప్యాకేజింగ్, మార్కెటింగ్ నిర్వహిస్తారు. గతేడాది మాత్రమే భాగస్వామి యూనిట్లతో కలిపి 45 కేజీల కుంకుమ ఉత్పత్తి చేశామని ఆకాష్ తెలిపారు.
100 చదరపు అడుగుల యూనిట్ ఏర్పాటు చేయడానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందనీ, ఆ యూనిట్ నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల విలువ గల కుంకుమ పంట వస్తుందని ఆకాష్ వివరించారు. ఈ పెట్టుబడి ఒకసారి మాత్రమే. గింజలు కేవలం ఒక్కసారి కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రతి గింజ నుంచి మూడు నుంచి ఐదు పువ్వులు వస్తాయి. ప్రతి పువ్వులో మూడు కుంకుమ రేకులు ఉంటాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో కుంకుమ పువ్వులు పూసి పంట సిద్దమవుతుంది. మిగిలిన నెలల్లో గింజల పెంపకానికి దృష్టి సారిస్తారు.
స్వచ్ఛమైన సౌరశక్తితో యూనిట్ నడపడం వల్ల విద్యుత్ ఖర్చు కూడా లేదని, ఎటువంటి ఎరువులు లేకుండా, కూలీల అవసరం లేకుండా 80% లాభం వస్తోందని ఆకాష్ తెలిపారు. 55 లక్షలు పెట్టుబడి పెట్టి, ఐదేళ్లలో 1.3 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించామని, అందులో ఎక్కువ భాగం చివరి రెండు సంవత్సరాలలోనే లభించిందని చెప్పారు. కాశ్మీర్ సఫ్రాన్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ పొందిన ఈ కుంకుమ ప్రతి గ్రాము రూ. 630కు అమ్ముతున్నారు. వారి ఈ సక్సెస్‌స్టోరీ, సాంప్రదాయ హద్దులను దాటి కొత్త దారుల్లో ముందుకెళ్లాలని కలలు కన్నవారికి స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు.
This post was last modified on February 19, 2025 4:39 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…