మహ్మద్ సిరాజ్.. మహ్మద్ సిరాజ్.. నిన్న రాత్రి నుంచి ఐపీఎల్ అభిమానుల చర్చల్లో మార్మోగి పోతున్న పేరిది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఈ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ సంచలన బౌలింగ్ ప్రదర్శన అందరినీ షాక్‌కు గురి చేసింది. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడతను. అందులోనూ అతడి తొలి రెండు ఓవర్ల ప్రదర్శన విస్మయం కలిగించేదే. ఈ రెండు ఓవర్లూ మెయిడెన్లే. అందులోనూ మూడు వికెట్లు కూడా పడ్డాయి.
పరుగుల వరద పారే ఐపీఎల్‌లో ఒక మెయిడెన్ పడటమే అరుదు. అలాంటిది వరుసగా రెండు మెయిడెన్లంటే అసాధారణమే. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటిదాకా ఏ బౌలరూ ఒక మ్యాచ్‌లో రెండు మెయిడెన్లు వేయలేదు. ఈ అరుదైన ఘనత సాధించిన సిరాజ్.. మన హైదరాబాదీనే కావడం విశేషం. అతడి నేపథ్యంలో కూడా ఎంతో ఆసక్తి రేకెత్తించేదే.
పాత బస్తీకి చెందిన ఒక ఆటో రిక్షా కార్మికుడి కొడుకు సిరాజ్. పేద కుటుంబానికి చెందిన ఆ కుర్రాడు క్రికెట్లోకి రావడం, అంతర్జాతీయ స్థాయికి చేరడమంటే మాటలు కాదు. అనుకోకుండా హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిధిలో జరిగే లీగ్స్‌లో ఆడిన అతను.. మెరుపు వేగంతో బంతులేయడం చూసి కోచ్ ప్రోత్సహించాడు. అతను లీగ్స్‌లో చెలరేగిపోయాడు. దీంతో 2017 ఐపీఎల్ సీజన్ ముంగిట అతడి పేరు చర్చనీయాంశం అయింది. అతను సన్‌రైజర్స్ ప్రతినిధుల కళ్లలో పడ్డాడు. వేలంలో అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ.2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆ ఫ్రాంఛైజీ. తొలి సీజన్లో ఆరు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు సిరాజ్.
తర్వాతి సీజన్లో బెంగళూరు అతడిని కొనుగోలు చేసిందే. ఆ సమయంలోనే భారత క్రికెట్ జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కింది. ఐతే తర్వాతి రెండు ఐపీఎల్ సీజన్లలో సిరాజ్ ఆకట్టుకోలేకపోయాడు. భారీగా పరుగులిచ్చేశాడు. 100కు పైగా ఓవర్లేసిన బౌలర్లలో అత్యంత పేలవమైన ఎకానమీ నమోదు చేసిన బౌలర్‌గా అతను అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు వరకు అతడి ఎకానమీ 9.5 పైనే కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో కూడా 3 ఓవర్లలో 44 పరుగులిచ్చి జట్టులో చోటు కోల్పోయాడు. అయినా సరే.. మళ్లీ కోహ్లి అతడికి అవకాశమిచ్చాడు. ఈసారి మాత్రం సంచలన బౌలింగ్‌తో ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు సిరాజ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates