Trends

ట్రాఫిక్ జామ్ : పరీక్ష కోసం ‘పక్షి’లా ఎగిరిన విద్యార్థి!

నిజమేనండోయ్… పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు ఓ విద్యార్థి ఏకంగా పక్షిలా రెక్కలు కట్టుకుని మరీ గాల్లోకి ఎగిరాడు. సకాలంలోనే అతడు పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఎంచక్కా పరీక్ష రాశాడు. చూసే వాళ్లతో పాటు వినే వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

అలా పరీక్ష హాల్ లోకి వెళుతున్న విద్యార్థులంతా గాల్లో నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగుతున్న తమ మిత్రుడిని చూసి నోరెళ్లబెట్టేశారు. ఏంటీ… ఎగ్జామ్ కోసం ఏకంగా గాల్లో ఎగురుతూ వచ్చావా? అంటూ అతడి ధైర్యాన్ని వారు కీర్తించకుండా ఉండలేకపోయారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్టలోని సతారా జిల్లా, వాయి తాలూకా పరిధిలోని పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే తన మండల కేంద్రంలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు.

రేపు పరీక్ష ఉందనగా… ఏదో అత్యవసర పని నిమిత్తం అతడు సమీపంలోని పంచ్ గణి అనే గ్రామానికి వెళ్లాడు. తెల్లారి లేస్తే… పరీక్ష ఉంది. అప్పటికే ఆలస్యమైంది. పంచ్ గణి నుంచి కళాశాల ఉన్న వాయికి దారి తీసే దారి నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది.

అంటే…రోడ్డు మార్గాన బయలుదేరితే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరడం కష్టమే. ఎన్ని అడ్డ రూట్లు వెతికినా ఫలితం లేదు. మరేం చేయాలని ఆలోచించిన సమర్థ్… పారా గ్లైడింగ్ ను తన ట్రాన్స్ పోర్ట్ మార్గంగా ఎంచుకున్నాడు.

అక్కడికి సమీపంలోనే పారా గ్లైడింగ్ కేంద్రం ఉంటే… దాని వద్దకు పరుగు పరుగున వెళ్లి… తన మదిలోని విషయాన్ని వారి ముందు పెట్టారు. కుర్రాడి ధైర్యానికి మెచ్చిన పారా గ్లైడింగ్ కోచ్…. సమర్థ్ కు గ్లైడింగ్ డ్రెస్ వేసి ఎంచక్కా పారా గ్లైడర్ ను ఎక్కించేశాడు.

ఎంచక్కా భుజానికి బ్యాగు…. పారా గ్లైడర్ రెక్కల కింద పక్షిలా అలా ఆకాశంలో ఎగురుతూ సమర్థ్… కొన్ని నిమిషాల వ్యవధిలోనే తన కళాశాల చేరుకున్నారు. ఇక గమ్యస్థానం వద్ద కూడా సమర్థ్ సేప్ గా ల్యాంఢ్ అయ్యేలా గ్లైడింగ్ కోచ్ సహకరించాడు. ఫలితంగా పరీక్ష కోసం పక్షిగా ఎగురుతూ వచ్చిన సమర్థ్ సకాలంలోనే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాడు.

సమర్థ్ గ్లైడింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పరీక్ష కోసం ఇంత సాహసానికి దిగిన సమర్థ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

This post was last modified on February 16, 2025 2:05 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

17 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

20 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

1 hour ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

1 hour ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago