ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత నౌకాదళం, వైమానిక దళం, డిఫెన్స్ రంగానికి చెందిన అనేక సంస్థలు తమ అత్యాధునిక వైమానిక సామర్థ్యాలను ప్రదర్శించాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియా పావిలియన్ లో భారతదేశ ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు.
ఈవెంట్‌లో భారత నౌకాదళం అధునాతన సాంకేతికతను ప్రదర్శిస్తూ, తన భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి చేసే కొత్త వైమానిక ప్రణాళికలను విశ్లేషిస్తోంది. ఇందులో మిగ్-29కే, హాక్ 132, పీ8ఐ లాంటి అధునాతన యుద్ధ విమానాలతో పాటు, నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న టెడ్‌బీఎఫ్ (ట్విన్ ఇంజిన్ డెక్-బేస్డ్ ఫైటర్) స్కేల్డ్ మోడల్‌ను ప్రదర్శిస్తున్నారు.
అలాగే, భారత్ అభివృద్ధి చేస్తున్న నావికా వైమానిక రంగానికి సంబంధించిన ఆత్మనిర్భర్ ఇండియన్ నేవల్ ఏవియేషన్ – టెక్నలాజికల్ రోడ్‌మ్యాప్ 2047 అనే దృక్పథ పత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ ఎయిర్ షోలో దేశీయ అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు పాల్గొంటున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, యుకే, జపాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్ వంటి 19 దేశాలకు చెందిన 55 కంపెనీలు ఇందులో ప్రదర్శనలు ఇస్తుండగా, భారత్ తరఫున లార్సెన్ & టుబ్రో, ఆదాని డిఫెన్స్, మహీంద్రా డిఫెన్స్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, అశోక్ లేలాండ్ డిఫెన్స్ వంటి 35 కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో భారత నావికా వైమానిక విభాగానికి చెందిన పీ8ఐ, మిగ్-29కే, కామోవ్ 31, సీకింగ్ 42బీ, ఎంహెచ్ 60ఆర్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు.
మొత్తం మీద, ఈ ఏరో ఇండియా 2025 భారతదేశ వైమానిక రంగ పురోగతికి అద్దం పట్టేలా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైమానిక, రక్షణ రంగ పరిశ్రమలకు భారతదేశాన్ని ఆకర్షించే వేదికగా నిలుస్తోంది.
This post was last modified on February 10, 2025 5:57 pm
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన…
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…
ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…
ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో…
పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్డీ…