పాకిస్తాన్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం మరోసారి వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకి తీవ్ర గాయం కావడం, ఆ గాయానికి స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కారణమని అనుమానాలు వెల్లువెత్తడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బంతి వేగాన్ని అంచనా వేయలేకపోవడం, కళ్లకు వెలుతురు నేరుగా తాకడం వల్లే గాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి నమ్మకం తక్కువైందని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి. గతంలో కటక్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ సమయంలో ఫ్లడ్ లైట్లు కొన్ని క్షణాలు ఆగిపోవడంతో, దానిని తేలికగా తీసుకుంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులను ట్రోల్ చేశారు. అయితే, గడ్డాఫీ స్టేడియంలో ‘ది గ్రేట్ లైట్ షో’ పేరిట జరిగిన ఫ్లడ్ లైట్ డిస్ప్లే వీడియో బయటకు రావడంతో, నెటిజన్లు తిరిగి పాకిస్తాన్‌ను ఘాటుగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఐపీఎల్‌లో వర్షం కారణంగా నిలిచిపోయిన ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన లైట్ షోతో గడ్డాఫీ స్టేడియంలోని లైట్ షోను పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు. ఆర్సీబీ జెర్సీ లాంచ్ ఈవెంట్‌లో చేసిన లైట్ షో, సాధారణ డీజే ఓపరేటర్ ఉపయోగించిన లైటింగ్‌ను ట్యాగ్ చేస్తూ, “ఇది కూడా గడ్డాఫీ స్టేడియంలో జరిగిందా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ “ముంబై వీధుల్లోని పెళ్లిళ్లలో కూడా ఇంతకంటే మెరుగైన లైట్ షో ఉంటుంది” అని కామెంట్ చేయగా, మరొకరు “హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై జరిగే లైట్ షో కూడా గడ్డాఫీ స్టేడియాన్ని మించి పోతుంది” అంటూ వ్యంగ్యంగా రాశారు. మొత్తంగా, గడ్డాఫీ స్టేడియంలో లైట్ షోపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ కొనసాగుతుండటంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on February 10, 2025 11:13 am
ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత…
పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్డీ…
ఇటీవలే జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ గెస్టుగా వచ్చిన దిల్ రాజుని ఉద్దేశించి…
రీజనబుల్ టైం అంటే.. ఎంతకాలం? ఈ ప్రశ్న వేసింది సామాన్య వ్యక్తులు కాదు. సామాన్య సంస్థలు కూడా కాదు. సాక్షాతూ…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన వైసీపీలోకి ఇప్పుడు కొత్త చేరికలు ఊపందుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవలే పీసీసీ చీఫ్…
నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి మాటలు ఊహించనంత దుమారం రేపాయి. పదకొండు…