ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్ లోనైనా ధాటిగా ఆడే రోహిత్, ఈ మధ్య కాలంలో పూర్తిగా బలహీనతను ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలోనూ అతని బ్యాటింగ్ నిరాశపరిచింది.
అతి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తుండగా, కెప్టెన్ రోహిత్ ఇలా ఉంటే టీమిండియాకు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
తన బ్యాటింగ్‌లో స్పష్టంగా నిలకడ లేకపోవడంతో అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. కెప్టెన్సీ లేకుంటే జట్టులో స్తానం ఉండేదా? అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని మ్యాచ్ లను పరిశీలిస్తే, రోహిత్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే క్రీజులో ఉండగలుగుతున్నాడు.
ప్రతిసారీ అదే పొరపాట్లు చేయడం, బౌలర్ల ట్రాప్‌లో పడిపోవడం చూస్తుంటే, అతను మళ్లీ ఫామ్ లోకి వస్తాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓపెనర్‌గా గట్టిగా నిలబడాల్సిన రోహిత్ ఇలా తడబడితే, మిడిలార్డర్ బ్యాటర్లపై మరింత భారం పడుతుంది.
గత వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా అతని ఫామ్ పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పటికీ అతను మెరుగైన ఆటతీరును కనబరచలేకపోతున్నాడు. ఇప్పుడు రోహిత్ ఆటపై రిటైర్మెంట్ చర్చలు మళ్లీ ఊపందుకుంటున్నాయి.
36 ఏళ్ల వయస్సులోనూ అతను ఇంకా నమ్మకంగా కొనసాగగలడా? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. బ్యాటింగ్‌లో పరాజయాలు ఎదురైతే, అతని కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు, విశ్లేషకులు రోహిత్ ఆటతీరును విమర్శిస్తూ, అతడు తక్కువ సమయంలోనే రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని కామెంట్లు చేస్తున్నారు. ఇది ధోనీ, కోహ్లీ రిటైర్మెంట్ చర్చల మాదిరిగానే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ రోహిత్ ఫామ్ ను తిరిగి సాధించకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
ప్రధానంగా మిడిలార్డర్ బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఎదుర్కోవాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. ఈ పరిస్థితిలో రోహిత్ తన ఆటను మెరుగుపర్చుకోవడం లేదా జట్టులో మార్పు అవసరమా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఒకవేళ ఇంగ్లండ్ తో మిగిలిన మ్యాచ్ లలోనూ అతను పేలవ ప్రదర్శన చేయడం కొనసాగిస్తే, రోహిత్ భవిష్యత్తు టీమిండియాలో ప్రశ్నార్థకంగా మారొచ్చు.
ఒకప్పుడు అభిమానులను తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన హిట్ మ్యాన్, ఇప్పుడు తన ఫామ్ కోల్పోయి నెమ్మదిగా విమర్శల బారిన పడుతున్నాడు. ఇప్పటికైనా అతను తన ఆటతీరును మెరుగుపర్చుకొని, కెప్టెన్సీకి తగిన విధంగా వ్యవహరిస్తాడా? లేక రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తాడా? అన్నది వేచిచూడాల్సిన అంశం.
This post was last modified on February 7, 2025 10:17 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…