అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన శేషాచలం అడవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన వన్య ప్రాణులతో పాటుగా పులి, చిరుత, ఎలుగు లాంటి క్రూర మృగాలు కూడా బారీ సంఖ్యలోనే ఉన్నాయి.
మొన్నటిదాకా వీటి వల్ల వెంకన్న భక్తులకు గానీ, సమీప ప్రాంతాల ప్రజలకు గానీ వీటి వల్ల ఎలాంటి ఆపద ఎదురు కాలేదు. అయితే ఇటీవలి కాలంలో తరచుగా వెంకన్న భక్తులకు చిరుతలు, పులులు కనిపిస్తున్నాయి. వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తాజాగా గురువారం తిరుమలకు అతి సమీపంలోకి చిరుత వచ్చేసింది. తిరుమల పరిదిలోని శిలాతోరణం వద్ద ఓ భారీ చిరుత అలా ఎంచక్కా ఓ రాతి మీద కూర్చుని కనిపించింది. ఈ దృశ్యాన్ని సర్వదర్శనం క్యూ లైన్ కు సమీపంలో ఉన్న భక్తులకు కనిపించింది. శిలాతోరణం సమీపాన… సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలోని వారికి కనిపించే దగ్గరకు చిరుత చేరిందంటే… ఇంకొన్నాళ్లు పోతే.. ఏకంగా చిరుతలు, పులులు తిరుమలలోకీ ప్రవేశిస్తాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
చిరుతను చూసిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. శిలా తోరణం వద్ద అలా ఠీవీగా కూర్చున్న చిరుత ఫొటోలు,వీడియోలు వైరల్ గా మారాయి.
This post was last modified on January 30, 2025 10:23 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…