యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై లావాదేవీల ట్రాకింగ్‌ను మరింత క్రమబద్ధంగా నిర్వహించగలుగుతారు.
ఈ నిబంధనను పాటించని యూపీఐ యాప్స్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు జరపలేరు. ఎన్‌పీసీఐ తెలిపిన ప్రకారం, నకిలీ ఐడీలను అరికట్టడం, లావాదేవీల భద్రతను మరింత పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఆల్ఫాన్యూమెరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) ఐడీలను మాత్రమే గుర్తించేలా కొత్త విధానం రూపొందించారని, దీంతో అవకతవకలకు అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్‌పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్‌లో యూపీఐ ద్వారా 16.73 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్‌లో ఈ సంఖ్య 15.48 బిలియన్లుగా ఉండగా, ఒక్క నెలలోనే 8 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరగా, నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది.
రోజువారీ లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. నవంబర్‌లో 516.07 మిలియన్ లావాదేవీలు జరిగినప్పటికీ, డిసెంబర్‌లో 539.68 మిలియన్లకు చేరాయి. ఈ పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఎన్‌పీసీఐ ఫోకస్ చేస్తోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులను గుర్తించి, తమ లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు, ఐడీలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
This post was last modified on January 30, 2025 2:30 pm
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…