పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన పేరు అందరికీ తెలుసు. ప్రముఖ వ్యాపార వేత్త, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్‌గా ప్రధాని మోడీకి కూడా ఆయన విశ్వాసపాత్రుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో ప్రధాని సూచనల మేరకు.. బీజేపీ కోరిక మేరకు.. వైసీపీ నత్వానీకి.. రాజ్యసభ సీటు ఇచ్చేసింది. తద్వారా ఆయన రాజ్యసభలో సభ్యుడయ్యారు.
అయితే.. ఈ ఏడాది జూన్‌తో నలుగురు సభ్యుల పదవీ కాలం పూర్తికానుంది. వీరిలో నత్వానీ కూడా ఉన్నారు. అప్పట్లో వైసీపీ నత్వానీకి టికెట్ ఇచ్చినప్పుడు.. సాయిరెడ్డి వంటివారు.. ఒక ప్రచారం చేశారు. తాము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని..తద్వారా ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. పారిశ్రామిక వేత్తలకు వైసీపీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత.. నత్వానీ.. వైసీపీ తరఫున గళం ఒకటి రెండు సార్లు వినిపించారు.
ఇక, ఇప్పుడు నత్వానీ పదవీ కాలం పూర్తవుతుండడంతో ఆయనను మరోసారి సభకు పంపించాలన్నది బీజేపీ వ్యూహం. అయితే.. ఈ వ్యవహారంలో టీడీపీ జోక్యం చేసుకుందని సమాచారం. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన చర్చలో కూడా నత్వానీ పేరు వినిపించిందని తెలిసింది. ఆయనను కొనసాగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ తరఫున గతంలో సభకు వెళ్లినా.. ఇప్పుడు టీడీపీ తరఫున పంపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కారణం ఇదే..
పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రబాబు.. నత్వానీకి మరోసారి సభ్యత్వం ఇవ్వడం ద్వారా.. పారిశ్రామిక వేత్తల విషయంలో తన దృక్ఫథాన్ని వెల్లడించాలని నిర్నయించుకున్నారు. అదేసమయంలో ఉత్తరాదిలోనూ.. తన పేరును మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నత్వానీకి ఇప్పుడు అవకాశం ఇస్తే.. అది జాతీయ స్థాయిలో మరింత ప్రచారానికి అవకాశం ఉంటుందని.. తద్వారా.. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందన్న భావన వస్తుందని అనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా నత్వానీని రెన్యువల్ చేయడం ద్వారా.. పారిశ్రామిక పురగతికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
This post was last modified on March 4, 2026 4:46 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…