Movie News

ఐపీఎల్ గురి చూసి కొడుతున్న పెద్ది

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్ర‌తి ప్రోమో బ్లాక్ బ‌స్ట‌ర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ కాంబినేష‌న్లో సినిమా అన్న‌పుడు మ‌రీ అంచ‌నాలేమీ లేవు. రామ్ చ‌ర‌ణ్ వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లను ఖాతాలో వేసుకోవ‌డం, బుచ్చిబాబుకు ఒక చిన్న సినిమా తీసిన అనుభ‌వం మాత్ర‌మే ఉండ‌డంతో ఈ ప్రాజెక్టు మీద అభిమానుల్లో సందేహాలు నెల‌కొన్నాయి.

కానీ పెద్ది నుంచి గ‌త ఏడాది ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చాక అంతా మారిపోయింది. ఆ గ్లింప్స్ సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. విజువ‌ల్స్‌తో పాటు బీజీఎం అదిరిపోవ‌డంతో ఇన్‌స్టంట్ హిట్ట‌యిపోయింది ఆ గ్లింప్స్. అందులో మేజ‌ర్ హైలైట్.. రామ్ చ‌ర‌ణ్ బ్యాటు ప‌ట్టి ముందుకు దూసుకొచ్చి వెరైటీగా కొట్టిన షాటే.

రీల్స్‌, షార్ట్స్‌లో ఈ షాట్ భ‌లే పాపుల‌ర్ అయింది. స‌రిగ్గా గ‌త ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు ఈ గ్లింప్స్ రిలీజ్ కావ‌డం.. క్రికెట‌ర్ల‌తో పాటు చాలామంది ఆ షాట్‌ను అనుక‌రించ‌డం.. ఐపీఎల్ ప్ర‌మోష‌న్ల‌లో కూడా అది భాగం కావ‌డంతో సినిమాకు ప్ర‌చార‌ప‌రంగా భ‌లే మైలేజీ వ‌చ్చింది.

ఆపై చికిరి పాట పెద్ది హైప్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రారా రై రా పాట సైతం ఇన్‌స్టంట్ హిట్ట‌యిపోయింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ స్టెప్స్‌తో పాటే ఈ పాట‌లోనూ రామ్ చ‌ర‌ణ్ కొట్టిన ఇంకో వెరైటీ క్రికెట్ షాట్ కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

ఈ పాట ఐపీఎల్ ముంగిటే రిలీజ్ కావ‌డంతో.. క్రికెట్ ప్రేమికులకు బాగా ఎక్కేస్తోంది. ఈ పాట‌కు క్రికెట్ విజువ‌ల్స్ జోడించి.. వైరల్ చేస్తున్నారు నెటిజ‌న్లు. చ‌ర‌ణ్ కొత్త షాట్ కూడా బాగా పాపుల‌ర‌య్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

ఈ నెల చివ‌రి వారంలో ఐపీఎల్ కొత్త సీజ‌న్ ఆరంభం కాబోతుండ‌గా.. మ‌ళ్లీ చ‌ర‌ణ్ పాట ఒక ఊపు ఊపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న పెద్ది సినిమాలో జాన్వి క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. వెంక‌ట స‌తీష్ కిలారుతో కలిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు ర‌విశంక‌ర్, న‌వీన్ యెర్నేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. సుకుమార్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఏప్ర‌ల్ 30న పెద్ది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on March 5, 2026 10:51 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

1 hour ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

1 hour ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

6 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

8 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

10 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

11 hours ago