భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.
మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా… ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 40 మంది దాకా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతపై ఇప్పటిదాకా అధికార ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే… మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు ముందే ఊహించింది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా భారీగానే చేసింది. అయినా కూడా బుధవారం తొక్కిసలాట జరగడం, అందులో 20 మంది దాకా భక్తులు ప్రాణాలు కోల్పోవడం యోగి సర్కారును అయోయంలో పడేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన యోగి… ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిని నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్తలాన్ని పరిశీలించిన డీఐజీ వైభవ్ కృష్ణ… ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని గుర్తించారు.
నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్ లను అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం, వచ్చినవాళ్లు వచ్చినట్లే పుణ్య స్నానాలు చేయడం, ఆ తర్వాత ఛేంజింగ్ రూములకు వచ్చి దుస్తులు మార్చుకోవడం… ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ ఛేంజింగ్ రూం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లో ఓ భక్తుడి కాలు ఇరుక్కుపోగా,… తన కాలును తీసుకునేందుకు ఆ భక్తుడు బారీకేడ్ ను ఒకింత నెట్టాడట. దీంతో ఆ బారీకేడ్ ఆ పక్కనే ఉన్న భక్తులపై పడిపోవడం… దాంతో మిగిలిన భక్తులంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వైభవ్ కృష్ణ తెలిపారు.
This post was last modified on January 29, 2025 3:36 pm
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…