అగ్రరాజ్యం అమెరికాలో ధనవంతులు నివసించే ప్రాంతం అది! కడుక్కున్న కాళ్లతో అక్కడ అడుగులు వేసినా ముద్రపడతాయేమో.. మట్టి అంటుతుందేమో.. అని భావించేంత క్లీన్‌గా.. ముఖమల్ వస్త్రంతో తుడిచిన అద్దంగా అక్కడి ఇళ్లు మెరిసిపోతూ ఉంటాయి. రహదారులు కూడా కడిగిన కంచాల్లా.. తళతళ మెరుస్తూ ఉంటాయి.
ప్రతి గంటకూ ఒకసారి రోడ్లు పరిశుభ్రం చేస్తూనే ఉంటారు. ఆకు రాలినా.. కాయితం పడినా.. వెంటనే తీసేస్తారు. అంత అందంగా.. అంత అద్దంగా మెరిసే లాస్ ఏంజెలస్ ప్రాంతం ఇప్పుడు కన్నీరు పెడుతోంది.
ఉన్నవారి ఇళ్లు.. ఉనికి కోల్పోయాయి. ఎటు చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉక్రెయిన్‌పై రష్యా చేసినయుద్దంలాగా.. గాజాపై ఇజ్రాయిల్ విసిరిన బాంబుల తర్వాత ఉన్న పరిస్థితిని లాస్ ఏంజెలస్ ప్రాంతం కళ్లకు కడుతోంది.
ఎన్నో కలలతో కట్టుకున్న ఇళ్లు కాలి బూడిద య్యాయి. పార్కు చేసిన కార్లు.. పార్కు చేసిన చోటే.. కాలి పోయి.. ఇనుప ముద్దల్లా మారిపోయాయి. కాలిపోయిన ఇళ్లు కొన్ని అయితే.. కాలుతూనే ఉన్న ఇళ్లు మరిన్ని. ఎటు చూసినా.. బూడిద-బొగ్గులు దర్శన మిస్తున్నాయి.
అమెరికాలో రాజుకున్న కార్చిచ్చు.. అత్యంత సంపన్నులు నివసించే లాస్ ఏంజెలస్‌ను బుగ్గి చేసింది. వేల కొద్దీ వాహనాలతో నీటిని తీసుకువచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా ఎక్కడా తగ్గడం లేదు. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది.
ఈ పరిణామాల తాలూకు వీడియోలు బాహ్య ప్రపంచాన్ని నిర్ఘాంత పోయేలా చేస్తున్నాయి. అమెరికాలోనే అత్యంత క్లీన్ సిటీగా.. పేరొందిన లాస్ ఏంజెలస్.. ఇప్పుడు బూడిద కుప్పగా మారడంతో అందరూ నివ్వెర పోతున్నారు. కోలుకునేందుకు సైతం మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
This post was last modified on January 12, 2025 3:30 pm
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…