Trends

పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?

తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు సూచనగా మారుతుంది.

సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతుల పండుగగా భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత, రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం వండకుండా, ఆ బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తమిళనాడులో ఈ పండుగను ‘పొంగల్’ అని పిలుస్తారు, అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగను ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించినది.

సంక్రాంతి పండుగలో నువ్వుల ప్రత్యేకత కూడా ఉంది. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. అవి శరీరానికి వేడి ఇస్తాయి, దీంతో వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో శరీరం అలవాటు పడుతుంది. సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది.. తెల్లవారుజామున ప్రజలు ఉత్తమ ఇంటిముందు భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవాలయాలలో గోదాదేవి తిరుప్పావై పాశురాలతో దేవుడిని ఆరాధిస్తారు. తిరుప్పావై తో రంగనాథుణ్ణి ఆరాధించిన గోదాదేవి భోగి పండుగ రోజు స్వామిని వివాహమాడి ఆయనలో లీనమైంది. అందుకే ధనుర్మాస వ్రతాన్ని బోగితో ముగిస్తారు.

ఇక ఇళ్లలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయమే. రేగిపళ్ళలు బదరీ ఫలాలు అని పిలుస్తారు.. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి కలిగిన రేగి పండ్లు పిల్లలపై పోయడం వల్ల వారికి సూర్యుడికి ఉన్నంత శక్తి సమకూరుతుంది అని పెద్దలు భావిస్తారు. అందుకే ఇంట్లో చిన్న పిల్లలకు రేగి పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు కలిపి భోగి పళ్ళు పోస్తారు.

ఇక సంక్రాంతి అంటే ఇళ్ళ ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. అంబరాన్ని తాకే గాలిపటాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో ఈ పండగ సమయంలో వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు తిరుగుతూ సందడి చేస్తారు. ఇక సంక్రాంతి రోజున పెద్దలకు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక సంక్రాంతి సమయంలో చేసే దానాల వల్ల పితృ దోషాలు తొలగుతాయని చాలామంది నమ్ముతారు.

ఇక సంక్రాంతి సంబరాలు చివరి రోజును సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడానికి సహాయపడిన పశుపక్షాదులను పూజించే కనుమ. ఆరోజు ఆవులను, ఎద్దులను, బర్రెలను ముస్తాబు చేస్తారు.. రైతన్నకు నేస్తాలైన పక్షుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇలా సంక్రాంతి అనేది మనిషి ప్రకృతిలో మమేకమౌతూ చేసుకునే ఓ గొప్ప సంబరం.

This post was last modified on January 4, 2025 7:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారికి సుప్రీం షాక్

ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…

1 hour ago

అడవి దొంగల వేటగాడు ‘డాకు మహారాజ్’

https://youtu.be/fNDRSver0uM?si=FuJxROyuCDfNq7jV వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ…

2 hours ago

ఎక్స్‌ట్రా 18 నిముషాలు… ఏంటా కథ ?

నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…

8 hours ago

‘డాకు’ పై హైప్ ఎక్కిస్తున్న నాగవంశీ

తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…

10 hours ago

రీరిలీజ్ ఫీవర్ వాళ్లకూ పాకింది

గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…

12 hours ago

పవన్ ప్రసంగంలో ఆలోచింపజేసే విషయాలు!

రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…

13 hours ago