Trends

చైనా మాంజా: ఇది పంతంగుల దారం కాదు యమపాశం…

సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో చుక్కలను తాకుతూ ఎగిరే రంగురంగుల పతంగులు దర్శనమిస్తాయి. అందరికీ ఎంతో ఆనందాన్ని పంచాల్సిన ఈ పండుగ.. కొన్ని కారణాల వల్ల చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే పతంగుల సందడి కారణంగా కొన్ని ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం పతంగులను ఎగుర వేయడానికి ఉపయోగిస్తున్న మాంజా అనడంలో సందేహం లేదు.

పతంగుల పోటీలలో మన గాలిపటం ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనేదానికంటే కూడా పక్కన వాళ్ళ గాలిపటాన్ని పడగొట్టడంలోనే చాలామంది మజా ఫీల్ అవుతారు. ఇక ఇందుకోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరం అవుతుంది.. ఇందుకోసం గత కొద్దికాలంగా పతంగుల పోటీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజుపొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఒక సైనికుడు కూడా దీని వలన తన ప్రాణాలను కోల్పోవడంతో పోలీసు అధికారులు ఇది కొన్నా, అమ్మినా చాలా పెద్ద నేరంగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇటు ఈ మాంజా వల్ల అని ఎన్నో పక్షజాతులు అంతరించిపోతున్నాయి. మార్కెట్లో దొరికే గాలిపటానికి ఉపయోగించే తాళ్లతో పోల్చుకుంటే ఈ చైనా మాంజా చాలా తక్కువ ధరకి వస్తుంది. కంటికి నచ్చే ఆహ్లాదకరమైన రంగులలో చాలా బలంగా ఉంటుంది. ఇది మంచి పదును మీద ఉన్న దారం కాబట్టి పతంగి పోటీలలో గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ చైనా మాంజ ఉపయోగంపై నిషేధం ఉంది.

అవును ఈ చైనా మాంజా ని ఉపయోగించినా.. విక్రయించినా అది చట్టరీత్యా నేరం కిందే పరిగణించబడుతుంది. అయినా కానీ మార్కెట్లో ఈ దారాలు విరివిగా దొరుకుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక దగ్గర వీటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి మొదలు కూడా కాకముందే అక్కడక్కడ ఈ చైనా మంజ కారణంగా ఎందరో ప్రమాదాల పాలైన వార్తలు మనం చదువుతూనే ఉన్నాము.

ద్విచక్ర వాహనదారులు ఈ చైనా మాంజా కారణంగా ఎక్కువ ప్రమాదాల బారిన పడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో అనుకోకుండా తెగిన ఈ తాడు వారి మెడలకు చుట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పతంగుల హడావిడి మొదలయ్యాక చాలామంది ద్విచక్ర వాహనదారులు గాయాలు పాలవుతున్నారు. ఈ దారం చిక్కులలో చిక్కుకొని ఎన్నో వందల పక్షులు ప్రతి సంవత్సరం మరణిస్తున్నాయి. ఇందులో ప్లాస్టిక్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాల కలయిక కూడా ఉంటుంది కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో హానికరమైనది.

మన సంతోషం కోసం నాలుగు రోజులు ఆడే ఒక చిన్న ఆట కారణంగా ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారో ఇకనైనా గ్రహించడం చాలా మంచిది. పర్యావరణానికి హాని లేకుండా.. ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండే సాధారణమైన మాంజాను మనం ఉపయోగించాలి. చైనా మాంజా నిషేధాన్ని గట్టిగా అమలు చేయడంలో ప్రభుత్వానికి సహకారం అందించాలి. మన చుట్టూ ఉన్నవారికి దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించి ఈ మాంజా వినియోగం ఆపాలి. అప్పుడే మనం సురక్షితమైన ,ఆనందమైన సంక్రాంతిని జరుపుకుంటాము.

This post was last modified on January 4, 2025 12:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లాయర్ లేకుంటే విచారణకు నో అన్న కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన…

16 minutes ago

చైనాలో బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన మహారాజ!

విజయ్ సేతుపతి మహారాజ గత ఏడాది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. తెలుగులో అంచనాలు లేకుండా రిలీజై…

1 hour ago

భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత…

2 hours ago

గేమ్ ఛేంజర్ నెగిటివిటీ : దిల్ రాజు కాన్ఫిడెన్స్!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను నిర్మించి రిలీజ్ చేయడంతో పాటు మరో భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్…

2 hours ago

విశాల్ ఇలా కనిపించడం ఆందోళనే

నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు.…

3 hours ago

ఆ ఒక్క చేప ఖరీదు 11 కోట్లు!

ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల…

3 hours ago