‘ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు’ అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి గుర్తు ఉండకపోవచ్చు. ఆ పాటకు తగ్గట్లే.. అమ్మాయి ప్రేమ కోసం అతగాడి తెగింపు సంచలనంగా మారటం తెలిసిందే. ప్రేమ.. ప్రేమా అంటూ చొక్కా చించేసుకొని మరీ అందరి కళ్లు గప్పి సరిహద్దలు దాటేయటం.. అక్రమంగా పాకిస్థాన్ లోకి ప్రవేశించటం.. చివరకు అక్కడి అధికారులకు దొరికిపోయి అక్కడి జైల్లో పడిన బాదల్ బాబు గురించి తెలిసిందే.
ఇప్పుడీ ఉదంతంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. దాని గురించి తెలిసినంతనే.. పాతాళ భైరవిలోని పాట గుర్తుకు వచ్చేస్తుంది.
ఫేస్ బుక్ లో పరిచయమైన పాక్ అమ్మాయితో డీప్ లవ్ లో పడిపోయాడు ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన ముప్ఫై ఏళ్ల బాదల్ బాబు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన 21 ఏళ్ల సారా రాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం అక్రమంగా సరిహద్దు దాటేసే సాహసానికి ఒడిగట్టాడు. నానా కష్టాలు పడి.. అందరి కళ్లు గప్పి సరిహద్దులు దాటేసి మరీ.. పాక్ లోకి అడుగు పెట్టిన బాదల్ బాబును మండి బహుద్దీన్ ప్రాంతంలోని అమ్మాయి ఊరికి వెళ్లాడు.
అయితే.. ఇక్కడే బాదల్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఇతగాడిని అనుమానించిన అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాడు. చివరకు తన ఫేస్ బుక్ ప్రేమకథను చెప్పేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. సారా రాణి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. బాదల్ బాబుతో తనకు పరిచయం ఉన్న మాట నిజమేనని.. కానీ, అతడ్ని పెళ్లి చేసుకోవటం తనకు ఇష్టం లేదని ట్విస్టు ఇచ్చింది. ప్రస్తుతం బాదల్ బాబు పాక్ జైల్లో ఉన్నాడు. ఇంతకూ బాదల్ బాబు.. రాణిలు కలిశారా? అన్న ప్రశ్నకు సదరు అధికారి ధ్రువీకరించలేదు.
మరోవైపు నిఘా అధికారులు రంగంలోకి దిగి అమ్మాయి తల్లిదండ్రులను వీరిద్దరి స్నేహం మీద ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రేమ కోసం వెనుకా ముందు చూసుకోకుండా తెగించి పాక్ గడ్డకు చేరుకున్న బాదల్ బాబుకు దిమ్మ తిరిగే షాక్ తగిలిందని చెప్పాలి. ఆన్ లైన్ ప్రేమలన్నీ మోసాలని చెప్పట్లేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే.. అక్రమ పద్దతుల్లో కాకుండా సక్రమంగా ఆ దేశానికి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు.. తాను ప్రేమ అనుకునే వేళ.. సదరు అమ్మాయి కూడా ప్రేమలో ఉందా? లేదా? అన్నది ఒకటికి నాలుగుసార్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బాదల్ బాబు అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పక తప్పదు.
This post was last modified on January 3, 2025 11:24 am
పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా పీ-4 విధానంపై దృష్టి పెట్టారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్‌గా పే ర్కొంటున్న ఈ విధానాన్ని ప్రజల్లోకి…
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…
అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…