అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే ప్రాణం పోతే.. ఏదో రూపంలో బతికేస్తాడన్నట్లుగా ఉండే ఈ సినిమా సీన్లకు తగ్గట్లే.. తాజా రియల్ సీన్ ఉందని చెప్పాలి. చనిపోయిన వ్యక్తి.. కాసేపట్లో చితిమంటల్లో కాలిపోవాల్సిన వేళ.. అనూహ్యంగా బతికిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉందని చెప్పాలి. అసలేం జరిగిందంటే..
డిసెంబరు పదహారో తేదీన కొల్హాపూర్ జిల్లా కసాబా – బావడా ప్రాంతానికి చెందిన 65 ఏల్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు బారిన పడ్డారు. దీంతో.. అతన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను పరిక్షించిన వైద్యులు పాండురంగ అప్పటికే మరణించినట్లుగా ప్రకటించారు. దీంతో.. అతడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధం చేశారు. పాండురంగ చనిపోయిన విషయం అతడి గ్రామం మొత్తానికి తెలిసింది. వెంటనే.. బంధువులు.. స్నేహితులు ఇంటికి వచ్చారు.
దీంతో పాండురంగ డెడ్ బాడీని త్వరగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు ఫోన్ల మీద ఫోన్లు రావటం మొదలయ్యాయి. దీంతో.. అంబులెన్సు డ్రైవర్ ను కాస్తంత వేగంగా తీసుకెళ్లాని కోరారు. దీంతో.. అంబులెన్సును వేగంగాపోనిచ్చిన ఒక డ్రైవర్.. మార్గమధ్యంలో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ను చూడకుండా అలానే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం బారీ కుదుపునకు లోనైంది. ఆ టైంలో పాండురంగ శరీరం అటు ఇటూ కదిలిపోయింది.
దీంతో.. కుటుంబ సభ్యులు పాండురంగ బాడీని స్ట్రెచర్ పైకి సరిగా పెట్టే వేళ.. అతడి చేతివేళ్లు కదలటం చూసిన భార్య ఒక్కసారి షాక్ తిని.. వెంటనే అంబులెన్సు డ్రైవర్ కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. స్పందించిన అంబులెన్సు డ్రైవర్ దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఐసీయూలో చేర్చించారు.
పాండురంగ ప్రాణాలతోనే ఉన్నారని అక్కడి వైద్యులు చెప్పటంతో పాటు.. వెంటనే యాంజియో ప్లాస్టీ చేశారు. రెండు వారాల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న పాండురంగ ఇంటికి రావటంతో ఆశ్చర్యపోవటం అందరి వంతైంది. స్పీడ్ బ్రేకర్ లేకుంటే మా ఇంటి పెద్దాయన పరిస్థితి ఏంటి? బతికి ఉన్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేస్తారా? అంటూ సదరు ఆసుపత్రిని కోర్టుకు ఈడుస్తామని పాండురంగ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ అవుతున్నారు. ఇప్పటివరకు స్పీడ్ బ్రేకర్లు కొన్నిసార్లు ప్రాణాలు తీయటం తెలుసు కానీ.. ప్రాణం పోయటం ఇదేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on January 3, 2025 9:46 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…