Trends

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టిటిడి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బి ఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఈ నెల 24న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ విధానానికి స్థాయిలో ఆమోదం లభించనుందని అన్నారు.

ముందుగా భక్తుల ఆధార్‌ కార్డు నంబర్‌, ఫేస్‌ రికగ్నేషన్‌ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్‌ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్‌ లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రన్స్‌లో స్కానింగ్‌ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్‌లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్ వేర్ అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.

This post was last modified on December 20, 2024 6:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

14 minutes ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

52 minutes ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

విడుదల పార్ట్ 3 క్లారిటీ ఇచ్చేశారు!

విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…

4 hours ago