Trends

13 ఏళ్ళ వైభవ్ వీరబాదుడు.. ఫైనల్ లో భారత్!

వైభవ్ సూర్యవంశి – గత కొన్ని రోజులుగా ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ అతన్ని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంది. దీంతో ఆ రేంజ్ ధరకు అమ్ముడైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. బీహార్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్‌లో తన దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకంగా శ్రీలంకపై సెమీఫైనల్‌లో 36 బంతుల్లో 67 పరుగులు సాధించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ వేలం అనంతరం అతను పాకిస్తాన్ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ గా అవుట్ అయ్యాడు. ఇక ఆ తరువాత UAE తో జరిగిన మ్యాచ్ ఓపెనర్ గా దిగి 76(46) పరుగులతో నటౌట్ గా నిలిచాడు. అందులో 6 సిక్స్ లు, 4 ఫోర్లు ఉండడం విశేషం.ఇక నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోను వైభవ్ వీరబాదుడు బాదాడు.

లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో భారత బౌలర్లలో ప్రణయ్ సింగ్, రిషి దేవ్ మంచి స్పెల్‌లు వేసి కీలక వికెట్లు తీసారు. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశి దూకుడైన బ్యాటింగ్‌తో 36 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఒక ఓవర్లో 31 పరుగులు చేసిన వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే 34 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ అమాన్ నాటౌట్‌గా 25 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇదే సమయంలో, మరో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య హోరాహోరీ పోరుకు వేదిక సిద్ధమైంది. ఫైనల్ పోరు ఈ ఆదివారం దుబాయ్ వేదికగా జరుగనుంది. ఇక ఆ మ్యాచ్ లో వైభవ్ ఏ విధంగా ఆడతాడో చూడాలి.

This post was last modified on December 7, 2024 12:01 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago