Trends

ప్రపంచంలో చెత్త ఎయిర్ లైన్స్ లో ఇండిగో ర్యాంకు

మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో తోపు ఎయిర్ లైన్స్ అన్నంతనే గుర్తుకు వచ్చేది ఇండిగో. దేశీయంగా ఎయిర లైన్స్ నిర్వహణలో ఆ సంస్థకు చెందిన విమానాలే భారీగా ఉండటం తెలిసిందే. దేశీయంగా రూట్ ఏదైనా.. ఇండిగో విమానాలు పది ఉంటే.. మిగిలిన అన్నీ ఎయిర్ లైన్స్ విమానాలు కలిసి ఐదు కూడా ఉండని దుస్థితి. దీంతో.. ఇండిగో తప్పించి మరో గత్యంతరం లేకుండా పోయింది. ఇండిగో ఎంత చెత్త ఎయిర్ లైన్స్ అన్న విషయాన్ని తెలిపే ర్యాంకింగ్ ఒకటి విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ఎయిర్ లైన్స్ ఏవేవీ ఉన్నాయన్న విషయాన్ని ర్యాంకింగ్స్ తో చెప్పేశారు.

విమానంలో ప్రయాణికులు జర్నీ చేసే క్యాబిన్లు మొదలు సేవల నాణ్యతతో పాటు.. విమానాలు నడిపే విషయంలో సమయపాలన తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్ ను డిసైడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ను డిసైడ్ చేశారు. ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్ లైన్స్ ను ప్రోత్సహించటమే తమ లక్ష్యమని.. ఈ ర్యాంకింగ్ ను చేపట్టిన ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ తో అత్యుత్తమ ఎయిర్ లైన్స్ ఏమిటన్న వాటిపై అందరికి అంతో ఇంతో అవగాహన ఉంటుంది. కానీ.. చెత్త ఎయిర్ లైన్స్ అందునా మన దేశంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఇండిగోకు ఎంత ర్యాంక్ లభించిందన్నది ఆసక్తికరంగా. ఈ ర్యాంకింగ్ తో 103వ స్థానం లభించింది. దీంతో.. ఇండిగో సేవలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఇక.. ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. ఈసారి ర్యాంకింగ్ లో అగ్రస్థానాన నిలిచిన బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్ ఆసక్తికరంగా దూసుకొచ్చింది. 2018 నుంచి ఇంతకాలం అగ్రస్థానంలో నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ ను పక్కకు నెట్టి.. అగ్రస్థానానికి చేరుకుంది బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఆటుపోట్లు ఎదుర్కొన్న అమెరికన్ ఎయిర్ లైన్స్.. మంచి పని తీరును ప్రదర్శించటం ద్వారా మూడు.. నాలుగు స్థానాల్లో నిలిచింది.

అతి చెత్త ఎయిర్ లైన్స్ ఏమేమి ఉన్నాయన్నది టాప్ 10 చూస్తే..
ర్యాంక్ విమానయాన సంస్థ
109 తునిసైర్
108 బజ్
107 నౌవెలైర్
106 బల్గేరియా ఎయిర్
105 ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్ లైన్స్
104 పెగాసస్ ఎయిర్ లైన్స్
103 ఇండిగో
102 తోరోమ్
101 ఎయిర్ మారిషస్
100 స్కై ఎక్స్ ప్రెస్
ప్రపంచంలో అత్యుత్తమ విమానయాన సంస్థల్లో టాప్ 10 చూస్తే..
ర్యాంక్ విమానయాన సంస్థ
01 బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్
02 ఖతార్ ఎయిర్ వేస్
03 యునైటెడ్ ఎయిర్ లైన్స్
04 అమెరికన్ ఎయిర్ లైన్స్
05 ప్లే (ఐస్ ల్యాండ్ కు చెందినది)
06 ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్
07 లాట్ పోలిష్ ఎయిర్ లైన్స్
08 ఎయిర్ ఆరేబియా
09 వైడెరో
10 ఎయిర్ సెర్బియా

This post was last modified on December 5, 2024 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘రాబిన్ హుడ్’ హుక్ స్టెప్.. అదిదా సర్ప్రైజు

ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్…

3 hours ago

పెద్ది…ఉగాది రోజు 20 సెకన్ల విధ్వంసం

రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…

6 hours ago

సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…

6 hours ago

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…

7 hours ago

వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…

7 hours ago

భూకంప విలయం… బ్యాంకాక్, మయన్మార్ లలో భారీ నష్టం

ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…

9 hours ago