నెదర్లాండ్స్‌లోని హేగ్ పట్టణంలో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ను తక్షణమే అరెస్టు చేయాలంటూ.. వారెంట్ జారీ చేసింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఇలా అంతర్జాతీయ న్యాయస్థానం ఎప్పుడూ ఒక దేశ ప్రధానిని తక్షణ అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో తాజా ఆదేశం సంచలనంగా మారింది.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఇజ్రాయెల్-గాజాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 44 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. ఉన్నవారికి ఆహారం, నీరు అందక ఆకలితోనూ చనిపోతున్నారు. వీటన్నింటికీ కారణమైన ఇజ్రాయెల్ ప్రధాన బెంజిమన్ నెతన్యాహూను ఎందుకు శిక్షించకూడదన్నది అంతర్జీయ న్యాయస్థానం ప్రశ్న. మానవ సంక్షోభం తీవ్రం కావడమే మరణాలు పెరగడానికి దారి తీసిందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నట్టు న్యాయస్థానం హెచ్చరించింది. “యుద్దం అంటే.. దేశాల మధ్య కాదు.. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య జరుగుతోంది. దీనివల్ల అమాయక చిన్నారులు దారుణ మరణాలకు దారితీస్తున్నారు. అమాయక పౌరులు తలదాచుకునేందుకు కూడా చోటు లేక.. మందుగుండు సామగ్రికి బలవుతున్నారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
బెంజిమన్ నెతన్యాహూతో పాటు.. ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాంట్‌పైనా తక్షణ అరెస్టు వారెంటును అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేయడం గమనార్హం. ఇదిలావుంటే, అరెస్టు వారెంటును పట్టించుకోవాల్సిన అవసరం లేదని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప ఇంకేమీ చేయడం లేదని వాదించారు. కాబట్టి.. అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వులను తాను లెక్క చేయబోనన్నారు.
ఏం జరుగుతుంది?
అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసిన తర్వాత.. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే వారెంటు తక్షణం అమలవుతుంది. లేకపోతే ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలిలో ఉన్న దేశాల మద్దతు ఉన్నా అమలు జరుగుతుంది. లేకపోతే ఈ విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
This post was last modified on November 22, 2024 9:37 am
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు.…