హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది ఇప్పుడు అసలైన సందేహం. ఇక దీనిపై కీలక అభిప్రాయాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందినట్లు తెలిపారు.
రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉందని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుండి మెట్రో రెండో దశకు ఆసక్తి కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లడం, నిర్వహణ కారణంగా ప్రతి ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అనుభవం తోనే ప్రైవేటు సంస్థలు వెనుకడుగేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఉదాహరణగా చూపించారు. బ్యాంకులు కూడా మెట్రో నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా లేవని తెలిపారు. దీంతో, మెట్రో రెండో దశ నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు.
రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, అందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) ద్వారా సమకూరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు కలిగించనున్నట్లు ఎండీ వివరించారు. మెట్రో రెండో దశకు ప్రజల సహకారం కీలకం అని, అందరి మద్దతు ఉంటే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 19, 2024 10:11 am
రాయ్‌పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…
ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి…
విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించని వేగంగా ముందుకు కదులుతోంది. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం…
ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని…
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ…
90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్…