కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నరకం చూసిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి బాలాజీ నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అతను ఆసుపత్రికి వెళ్లగా సాధారణ జ్వరమే అని నిర్ధరించారు. కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.
కానీ కరోనా టైంలో జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. జ్వరానికి క్వారంటైన్ ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని మిగతా ముగ్గురు సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగెటివే వచ్చింది. అయినా సరే కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉండాలని.. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు.
అధికారులు ఆదేశాల్ని అనుసరించి ఇంటిపట్టునే ఉన్న ఈ ఫ్యామిలీ ఈ నెల ద్వితీయార్ధంలో క్వారంటైన్ గడువు ముగిశాక అవసరాల కోసం బయటికి వచ్చింది. ఐతే కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి వచ్చిన అధికారులు యువకుడి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని చెప్పి పీపీఈ కిట్ ఇచ్చారు. అసలు కొత్తగా తాము శాంపిలే ఇవ్వలేదని.. కరోనా పాజిటివ్ అని ఎలా తేల్చారని అడిగినా సమాధానం లేదు.
తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆమె శాంపిల్ అంటూ ఏమీ లేదని తేలింది. చివరికిప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. జ్వరం అని ఆసుపత్రికి వెళ్లిన పాపానికి తమను అధికారులు ఆటాడుకున్నారంటూ సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీని గురించి స్థానిక మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
This post was last modified on April 28, 2020 4:12 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…