భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుదముట్టించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరిందని ఆయన వెల్లడించారు.
మిసైల్ ప్రయోగం పూర్తయ్యాక, దాని గమనం, పనితీరును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా విశ్లేషించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ క్షిపణిని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఈ మిసైల్ అభివృద్ధికి కీలకంగా నిలిచింది.
డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ భాగస్వాముల సహకారంతో ఈ మిసైల్ రూపుదిద్దుకుంది. దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైన సాధనమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రక్షణ అధికారులు అందరినీ అభినందించారు. “ఇది భారత రక్షణ రంగం బలోపేతానికి తార్కాణం. ఈ విజయం సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్తుంది,” అని ఆయన సోషక్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విజయంతో, మిలటరీ టెక్నాలజీ రంగంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పవర్ఫుల్ గా చూపించింది. హైపర్ సోనిక్ మిసైల్ విజయవంతమైన ఈ పరీక్ష భవిష్యత్తులో రక్షణ రంగానికి మరింత విశ్వాసాన్ని నింపనుంది.
This post was last modified on November 18, 2024 1:27 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…