భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా, ఇది కోహ్లీ చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ ఇక రాబోయే రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కు కూడా మెల్లగా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 22న పెర్త్‌లో ప్రారంభమవుతున్న తొలి టెస్టు, కోహ్లీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో పలు అద్భుతాలు నమోదు చేశారు. 2014 సిరీస్‌లో నాలుగు సెంచరీలతో విశేషమైన ప్రదర్శన చూపించారు. 2018లో భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచినప్పుడు కోహ్లీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన నెలకొంది.
2023లో వెస్టిండీస్‌పై చేసిన సెంచరీ తర్వాత, కోహ్లీ మళ్ళీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇప్పటికే చక్కటి రికార్డును కలిగిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మళ్ళీ తన బ్యాటింగ్ సత్తాను చాటుతారని గంగూలీ లాంటి క్రికెట్ నిపుణులు నమ్ముతున్నారు. “కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా సిరీస్ కావొచ్చు.. తన అనుభవంతో జట్టుకు మద్దతు ఇవ్వడం, విజయం సాధించడం అతడి లక్ష్యంగా ఉంటుంది” అని గంగూలీ వ్యాఖ్యానించారు.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు గాయాల బెడదతో కష్టాల్లో ఉంది. శుభమన్ గిల్, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, ఇతర యువ ఆటగాళ్ల అనుభవం కొరవడడం వల్ల కోహ్లీపై అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్ తర్వాత 2025 వరకు మళ్లీ భారత్‌కు ఆసీస్ పర్యటన ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ సిరీస్ కోహ్లీకి ఆఖరి ఆస్ట్రేలియా పర్యటనగా మారవచ్చు. అయితే, ఈ అనుమానాల మధ్య, కోహ్లీ ఈ సిరీస్‌లో తన బ్యాటింగ్ ప్రతిభతో చరిత్ర సృష్టిస్తారనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.
This post was last modified on November 18, 2024 12:51 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…