Trends

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న సెన్సాఫ్ హ్యుమర్ ను పది మందితో పంచుకోవటానికి చేస్తున్న రీల్స్ అంతకంతకూ విస్తరిస్తూ.. ప్రమాదకర ఫీట్లు చేసేలా చేస్తున్నాయి. సోషల్ ఇమేజ్ ను పెంచుకోవటానికి ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి వారి కారణంగా ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా రైల్వే శాఖ సీరియన్ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇకపై.. రైల్వే కార్యకలాపాలకు.. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంతేకాదు.. రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ.. ప్రయానికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ట్రాకులు.. కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు షూట్ చేసే వారి కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదకర ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇటీవల జైపూర్ డివిజన్ లో రైల్వే ట్రాకుపై ఒక ఎస్ యూవీ నడిపిస్తూ స్టంట్లు చేస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసు నమోదు చేయటం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు షూట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజానికి ఈ వీడియో షూట్ చేసే వేళలో.. గూడ్స్ రైలు లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇలాంటివే పలు ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలోని పలువురు కాలేజీ విద్యార్థులు ట్రైన్ ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయటమే కాదు.. రైల్వే స్టేషన్ లో గందరగోళాన్ని క్రియేట్ చేసే అంశం వెలుగు చూసింది. ఒక వీడియో షూట్ కోసం ట్రైన్ మీదకు ఎక్కే ప్రయత్నం కూడా చేశారు.

ఇలాంటి విపరీత చర్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా రైల్వే బోర్డు సీరియస్ నిర్ణయాల్ని తీసుకుంది. రీల్స్ చేసేందుకు రైల్వే ప్రాంగణాల్ని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. రీల్స్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. కొందరు ఆకతాయిలు హద్దులు దాటారని.. రైల్వే ట్రాకులపై వస్తువుల్ని పెట్టటం.. వాటిపై వాహనాల్ని నడపటం.. కదులుతున్న ట్రైన్లలో డేంజరస్ ఫీట్లు చేయటం లాంటి వాటి పనులతో ప్రాణాల్ని పణంగా పెట్టటమే కాదు.. వందల మంది రైల్వే ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నట్లుగా ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలో ఇమేజ్ కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై ఇలాంటి చర్యలు మంచివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on November 16, 2024 10:38 am

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

1 hour ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

5 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

6 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

8 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago