మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ కృష్ణారామా అనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే, కాలం మారింది..ట్రెండ్ మారింది..దానికి తగ్గట్లుగా మహిళలకు కూడా వయసుతో సంబంధం లేకుండా వివిధం రంగాల్లో తమ అభిరుచులు, ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ రాణిస్తున్నారు. సొంతగా యూట్యూబ్ ఛానెళ్లు రన్ చేసుకుంటూ…వ్యాపకం..వ్యాపారం ద్వారా కోట్లు అర్జిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా మధులిక ఆ కోవలోకే వస్తారు. 2011లో యూట్యూబ్ కుకరీ ఛానల్ మొదలుబెట్టిన నిషా దేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్ గా నిలిచారు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా టీచర్ గా పనిచేసేవారు. 2009లో పిల్లలు తమ ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఆ తర్వాత తన భర్త గుప్తాతో కలిసి నిషా నోయిడాకు షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంలోనే ఉషా..తన వంటల అభిరుచిని వదులుకోకుండా టీచర్ జాబ్ వదిలేసి యూట్యూబ్ కుకరీ ఛానెల్ మొదలుబెట్టారు. ఆ వయసులో యూట్యూబ్ ఛానెల్ మొదలుబెట్టి రన్ చేయడం ఏంటని కొందరు విమర్శించారు. అయినా సరే విమర్శలను పట్టించుకోకుండా సాంప్రదాయ భారతీయ శాఖాహార వంటకాలను తయారు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుబెట్టింది.
ఆమె రెసిపీలతో పాటు హిందీలో వీడియోలు చేయడం, వంట ఎలా చేయాలో ఆమె చెప్పే విధానం నచ్చి అనతి కాలంలోనే సబ్ స్క్రైబర్లు భారీగా పెరిగారు. దీంతో, భారతదేశంతోపాటు విదేశాలలో ఆమె కుకరీ ఛానెల్ కు అభిమానులు మిలియన్లలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 14.5 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు. 2,300 కంటే ఎక్కువ వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. సరళమైన భాష, సులభమైన పద్ధతులలో వంటలను పోస్ట్ చేయడంతో చాలామంది యువత ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా యూట్యూబ్ ఛానెల్ తో లేటు వయసులో కెరీర్ మొదలుబెట్టిన నిషా 65 ఏళ్ల వయసులో 43 కోట్ల రూపాయల సంపాదనతో ప్రస్తుతం దేశంలోనే రిచెస్ట్ యూట్యూబర్ గా నిలిచారు. నిషా ప్రస్తుతం పలు ఫుడ్ వెబ్ సైట్లను కూడా రన్ చేస్తున్నారు.
This post was last modified on November 13, 2024 2:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి…
ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి,…
తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…