ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్, ఇప్పుడు తన బ్యాటింగ్ ప్రదర్శనతో విమర్శకులకు సమాధానమిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సంజు శాంసన్ అద్భుతమైన శతకం సాధించాడు. ఇలా వరుసగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో రెండుసార్లు శతకాలు నమోదు చేసి, ఈ ఫీట్ సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
అతన్ని టీమిండియాలోకి తీసుకోవడమే దండగా అన్నవారే ఇప్పుడు జేజేలు కొట్టేలా చేస్తున్నాడు. నిజానికి సంజూ చాలా మంచి టైమింగ్ ఉన్న ప్లేయర్, ఐపీఎల్ లో అతని స్ట్రైక్ రేట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక టీమిండియాలో ఫామ్ లేక ఇంతకాలం సతమతమవుతున్న సంజూ మొత్తానికి సెంచరీలతో ట్రాక్ లోకి వచ్చేశాడు.
నిన్నటి మ్యాచ్ అనంతరం కెరీర్ గురించి మాట్లాడిన సంజూ.. తన కెరీర్‌లో విజయాల కంటే చాలా విఫలాలే ఎక్కువగా ఎదుర్కొన్నానని, ప్రతి సారి విమర్శలు ఎదుర్కొంటూ తనపై నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. ఐపీఎల్‌లో భారీ స్కోర్లు చేసినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో విఫలమయ్యానన్న భావన తనను చాలా బాధించిందని చెప్పాడు.
అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నానే.. భావనతో ఎన్నోసార్లు మధనపడ్డాను. సమర్ధవంతంగా జట్టుకు సహకరించాలని బలంగా కోరుకున్నా. అలాంటి సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన సపోర్ట్, నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.. అని సంజు చెప్పాడు. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఉండగా, అతని మార్గనిర్దేశకంలో కొనసాగుతున్నాను, స్పిన్ బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలనే విషయాలలో పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలిపాడు.
This post was last modified on November 9, 2024 1:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…