అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం కొన్ని అగ్ర దేశాలు ఎంతో ఆసక్తి చూపించాయి. ఇక ఆయన విజయం సాధించడంతో మార్కెట్‌లో గట్టి ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీలకు జాక్ పాట్ తగిలినట్లయ్యింది. ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా ట్రంప్ గెలవాలి అని ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో సైతం జనాలను ప్రభావితం చేసేలా ప్రణాళికలు రచించారు.
ఇక ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లు ట్రంప్ గెలుపు నేపధ్యంలో మరింత బలపడి, భారీ లాభాలను అందుకున్నాయి. ఈ విజయంతో మస్క్ సంపద ఏకంగా 26.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది.
అంతేకాక, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.60 వేల కోట్లు) పెరిగింది. తద్వారా ఆయన సంపద 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు మంచి ఊపు చూపడం, బెజోస్ కంపెనీల స్టాక్స్‌పై కూడా ఆ ప్రభావం పడడం విశేషం.
ఇక, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో లారీ ఎలిసన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వంటి ప్రపంచ స్థాయి కుబేరుల నికర సంపదలోనూ మెరుగుదల కనిపించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ విజయం నేపథ్యంలో తక్షణ ప్రాప్తిలో ఉన్న గ్లోబల్ మార్కెట్స్‌కు బలాన్ని అందించాయి. ఈ ప్రభావం వలన అమెరికా మార్కెట్లలో లాభాలు పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీల షేర్లు మరింత గట్టిపడినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…