Trends

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం మరో మలుపు తిప్పుకుంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు ఇక ఒక్కటే దారి, తమ బందీలను విడిచిపెడితే, ఈ యుద్ధం రేపే ముగుస్తుందని తెలిపారు. సిన్వర్ మరణంతో ఇజ్రాయెల్‌కు ఒక ప్రధాన విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.

“హమాస్ తమ ఆయుధాలను వదిలిపెట్టి, బందీలను తిరిగి పంపిస్తే యుద్ధం రేపే ముగుస్తుంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్లు ఇలాగే ఉంటారు. కానీ బందీలను విడిచిపెడితే హమాస్ సైనికులు బయటకు వచ్చి బతకగలుగుతారు. లేకపోతే వేటాడి మరీ చంపుతాం” అని స్పష్టం చేశారు. గత అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

దీనికి సూత్రధారి యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. బుధవారం జరిగిన యాక్షన్‌లో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చాయి. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించారు. అయితే హమాస్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

సిన్వర్ మరణం తమకు పెద్ద విజయం అని నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధం పూర్తిగా ముగియకపోయినా, ఈ దశ తర్వాత పరిణామాలు మరింత స్పష్టతతో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా స్పందించారు. హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ మరణాన్ని న్యాయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు బందీలు విడిపోతే ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని అన్నారు.

This post was last modified on October 18, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘రాబిన్ హుడ్’ హుక్ స్టెప్.. అదిదా సర్ప్రైజు

ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్…

2 hours ago

పెద్ది…ఉగాది రోజు 20 సెకన్ల విధ్వంసం

రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…

5 hours ago

సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…

6 hours ago

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…

6 hours ago

వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…

6 hours ago

భూకంప విలయం… బ్యాంకాక్, మయన్మార్ లలో భారీ నష్టం

ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…

9 hours ago