ప్రభుత్వమే కాదు.. పార్టీ కూడా పరిహారం

ప్రభుత్వమే కాదు.. పార్టీ కూడా పరిహారం

చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఉండటం  ముందుచూపు ఉన్న రాజకీయనాయకుడి లక్షణం. కోర్టు చిక్కులతో ప్రత్యక్షంగా పాలనా పగ్గాలు చేపట్టలేని ఆశక్తతతో ఉన్న జయలలిత.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదోలా అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్నారు.

ప్రతి ఎన్నికలకు ప్రభుత్వాన్ని మార్చే గుణం ఉన్న తమిళతంబీల తీరు తెలిసిన అమ్మ.. ఈసారి మాత్రం అలా జరగకుండా చూడాలని తపిస్తున్నారు. అందుకే భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టటం మొదలు.. వినూత్న పథకాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఊహించని విధంగా ఏపీ పోలీసులు.. అటవీ అధికారులు చేపట్టిన భారీ ఎన్‌కౌంటర్‌తో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించటం.. వారంతా తమిళులు కావటంతో తమిళనాడు ప్రభుత్వం ఒక్కసారి అలెర్ట్‌ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగాలు రాష్ట్రంలో ఎలా ఉంటాయో తెలిసిందే. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూసే రాజకీయ పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. అన్నాడీఎంకే సర్కారు వేగంగా పావులు కదిపించింది.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయన్ని తమిళనాడు సర్కారు ప్రకటించింది. అంతేకాదు.. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అన్నాడీఎంకే పార్టీ సైతం తాజాగా పరిహారాన్ని ప్రకటించింది. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున సాయం ప్రకటించింది. ప్రతిపక్షాలు నిద్ర లేచే సరికే అటు ప్రభుత్వం తరఫున.. ఇటు పార్టీ తరఫున పరిహారం ప్రకటించేసి తంబీల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేసింది. అమ్మా.. మజాకానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు