కేసీఆర్‌ను తిడితే పది కోట్లా?

కేసీఆర్‌ను తిడితే పది కోట్లా?

తిట్లకు ఇంత విలువ ఉందని ఈ రోజే తెలిసింది! ఓ వ్యక్తిని అదే పనిగా తిడితే ఏకంగా పది కోట్ల రూపాయలు ఇస్తారా? ఐతే ప్రపంచంలో అత్యంత ఖరీదైన తిట్లు ఇవే అయ్యేవేమో! కానీ ఇంత పెద్ద ఆఫర్‌ను తిరస్కరించానని చెబుతున్నాడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌.

రాములు పేరు జనాలకు పెద్దగా పరిచయం లేదు కానీ.. ఆయన మాత్రం ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను తిడితే రూ.10 కోట్లు ఇస్తామంటూ తనకు కాంగ్రెస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా తనకు ఫోన్‌ చేసి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను అదే పనిగా విమర్శించాలని కోరారని.. ఇందుకోసం తనకు రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారని వెల్లడించారు రాములు నాయక్‌.

రాహుల్‌ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, జైరాం రమేష్‌, దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పలుమార్లు ఇదే విషయమై ఫోన్‌ చేశారన్నారు. ఐతే ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌ను తిట్టడానికి తాను అంగీకరించలేదన్నారు. కాంగ్రెస్‌ నేతల ప్రతిపాదనను తాను తిరస్కరించడంతో వాళ్లు ఫోన్‌ చేయడం మానేశారంటున్నారు. కేసీఆర్‌ను తిట్టమని కాంగ్రెస్‌ నాయకులు రాములును అడిగి ఉండొచ్చు. ఇందుకోసం ఎంతో కొంత ప్రతిఫలం ఇస్తామని చెప్పి ఉండొచ్చు. కానీ అందుకోసం ఏకంగా రూ.10 కోట్లు ఆఫర్‌ చేసి ఉంటారా అనేది ప్రశ్నార్థకం!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు