టిప్ ఛాలెంజ్.. బిల్ రూ.1650.. టిప్ రూ.1.45లక్షలు

టిప్ ఛాలెంజ్.. బిల్ రూ.1650.. టిప్ రూ.1.45లక్షలు

గ్రీన్ ఛాలెంజ్.. రైస్ బకెట్ ఛాలెంజ్.. ఇలా చెబుతూ పోతే చాలానే ఛాలెంజ్ లు తెర మీదకు వస్తుంటాయి. ఇప్పుడు అమెరికాలో 2020 ఛాలెంజ్ ట్రెండ్ గా మారింది. అక్కడి పలువురు సెలబ్రిటీలు.. ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను తమకు తాముగా అమలు చేస్తున్నారు. ఇంతకీ 2020 ఛాలెంజ్ ఏమిటంటారా? సింఫుల్.. హోటల్ కానీ రెస్టారెంట్ కానీ తిన్న దానికి అయ్యే బిల్లు ఎంతైనా కావొచ్చు.. దాన్ని సర్వ్ చేసిన సర్వర్ కు మాత్రం 2020 డాలర్లను టిప్ గా ఇవ్వటం ట్రెండ్ గా మారింది.

మిషిగన్ అల్సేనాలోని థండర్ బే రివర్ రెస్టారెండ్ లో డేనియన్ ఫ్రాంజోని పని చేస్తున్నారు. ఆదివారం ఒక కస్టమర్ కు ఫుడ్ సర్వ్ చేశారు. తాను తిన్న దానికి 23 డాలర్ల (మన రూపాయిల్లో రూ.1650) ను చెల్లించారు. కానీ.. టిప్ మాత్రం ఏకంగా 2020 డాలర్లను పే చేశారు. అక్కడి మేనేజర్ సదరు సర్వర్ ను పిలిచి 2020 (మన రూపాయిల్లో ఏకంగా రూ.1.45లక్షలు) డాలర్లు ఆమెవేనని చెప్పారు.

దీన్ని ఆమె అస్సలు నమ్మలేదు. తన లాంటి వారికి ఇలాంటివి జరగటమా? అని ఆమె ఆశ్చర్యపోయారు. ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమంటే.. భారీ టిప్ పొందిన సదరు సర్వర్ ఒక హోటల్ కు వెళ్లి అక్కడ తనకు ఫుడ్ సర్వ్ చేసిన వారికి 20.20 డాలర్లను టిప్ గా ఇచ్చి తాను ఇవ్వగలిగినంత మొత్తాన్ని ఇచ్చేయటం గమనార్హం. ఇక.. తనకు వచ్చిన భారీ టిప్ తో తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవటంతో పాటు.. మిగిలిన మొత్తాన్ని దాచుకుంటానని చెప్పారు.

కొత్త సంవత్సరం వేళ (2020) టిప్ చాలెంజ్ లో భాగంగా చాలామంది ప్రముఖులు.. సెలబ్రిటీలు.. నటీనటులు.. వ్యాపారవేత్తలు ఇలా చేస్తున్నారు. అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ టిప్ ఛాలెంజ్ ఒక ట్రెండ్ గా మారింది. మన దగ్గరి నటీనటులు.. సెలబ్రిటీలు.. దీన్ని ఫాలో అవుతారా? చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English