'ప్ర‌భుత్వ అధికారులు ప‌నిచేయ‌క‌పోతే కొట్టండి'

'ప్ర‌భుత్వ అధికారులు ప‌నిచేయ‌క‌పోతే కొట్టండి'

ఉన్న‌త స్థానంలో ఉన్న‌వారు బాధ్య‌తాయుతంగా మాట్లాడ‌టంతో పాటుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంటుంది. అయితే, కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌క‌మో లేదా కాక‌తాళీయంగానో తెలియ‌దు కానీ...కొంద‌రు అదే రీతిలో ఇబ్బందుల్లో ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్రభుత్వాదికారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిచేయకపోతే కొట్టండి అని పిలుపునిచ్చారు.

నాగ్‌పూర్‌లో జరిగిన లఘు ఉద్యోగ భారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన నితిన్ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ,   'ప్రభుత్వాధికారులు సరిగ్గా పని చేయకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారిని కొట్టండి' అంటూ పిలుపునిచ్చారు.

'అధికారులు ప్రభుత్వ సేవకులు మాత్రమే. కానీ నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నేను ప్రజలకు సమాధానం చెప్పాలి.  అవినీతికి పాల్పడే అధికారులను దొంగలుగా పరిచయం చేస్తాను. అనుకున్న సమయానికి పనులు పూర్తవపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, అధికారులపై దాడి చేయండని సూచిస్తాను. ఒక వ్యవస్థలో న్యాయం జరగలేదంటే, ఆ వ్యవస్థను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ఉపాధ్యాయులు నాకు ఇదే నేర్పారు' అని అన్నారు.

పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఇంతలా విరుచుకుపడ్డ గడ్కరీ...అసలు ఏ సమస్యపై మాట్లాడారో, ఏ శాఖ అధికారులనుద్దేశించి మాట్లాడారో చెప్పకపోవడం గమనార్హం. అధికారంలో ఉన్న నాయకులే ఈ విధంగా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

కీల‌క హోదాలో ఉన్న వ్య‌క్తులు ఇచ్చే పిలుపు ఆధారంగా ఎవ‌రైనా ఆ విధంగా ప్ర‌వ‌ర్తిస్తే, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తితే ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన స‌మ‌స్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వప‌ర‌మైన లోపాల‌ను  చ‌క్క‌దిద్ద‌క‌పోతే దానికి ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని నిల‌దీస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English