అనుపమకు ఆనందం లేదు పాపం

అనుపమకు ఆనందం లేదు పాపం

అందం, అభినయం రెండూ ఉన్నాయి. వరుసగా హిట్లు కూడా పడ్డాయి. వేదికలెక్కితే చక్కగా మాట్లాడుతుంది. అభిమానులతో అందంగా ముచ్చటిస్తుంది. మొత్తంగా టాప్ హీరోయిన్ కావడానికి ఉండాల్సిన అన్ని లక్షణాలూ అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్నాయి. అయినా కూడా ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు.

ఒక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న అనుపమకు.. వరుసగా కొన్ని పరాజయాలు పలకరించేసరికి వెనుకబడిపోయింది. గత ఏడాది ‘హలో గురూ ప్రేమ కోసమే’తో కొంచెం పుంజుకున్నట్లు కనిపించింది కానీ.. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రాలేదు. స్టార్లు, ఫామ్‌లో ఉన్న హీరోల పక్కన ఆమెకు ఛాన్సులు రావట్లేదు.

ఇప్పటిదాకా హిట్టు రుచే తెలియని బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘రాక్షసుడు’ సినిమా చేసింది అనుపమ. ఇది ఒకరకంగా అనుపమ స్థాయికి తగని సినిమానే. అయినా చేసింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యేలాగే కనిపిస్తోంది. కానీ సినిమా ఆడినా అనుపమకు ఏమాత్రం ఉపయోగపడుతుందన్నది సందేహంగానే ఉంది. ఈ సినిమా గురించి అనుపమ గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. స్క్రీన్ టైం తక్కువ. కథలో ప్రాధాన్యమూ తక్కువే. ఏదో ఉందంటే ఉంది అనిపించింది.

ఉన్నంతలో బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ అనుపమ పాత్ర అయితే అభిమానులకు అంతగా రుచించడం లేదు. సినిమా సక్సెస్ అయినా దీని వల్ల అనుపమ కెరీర్ అయితే పుంజుకునేలా కనిపించడం లేదు. మరి అనుపమ అందానికి, నట ప్రతిభకు తగ్గ పాత్ర ఇచ్చి ఆమె కెరీర్‌కు ఊపు తెచ్చేదెవరో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English