జ‌గ‌న్ విలువ‌ల స‌త్తా తేల్చే ప‌నిలో బీజేపీ

  జ‌గ‌న్ విలువ‌ల స‌త్తా తేల్చే ప‌నిలో బీజేపీ

'మాట త‌ప్ప‌ను...మ‌డ‌మ తిప్పను' వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు. ''విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేస్తాను. గ‌తంలో ఈ రాష్ట్రంలో కొన‌సాగిన రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉంటుంది నా ప‌రిపాల‌న‌'' ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన త‌ర్వాత జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌. నిండు అసెంబ్లీలో జ‌గ‌న్ ఈ మాట‌లు చెప్తూ..జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హించ‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రైనా త‌న పార్టీలో చేరాలి అనుకుంటే...ఆ పద‌వికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌ని ప‌క్షంలో స‌భాప‌తి గా ఉన్న స్పీక‌ర్ త‌నకు ఉన్న పూర్తి అధికారాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ఫిరాయించిన నేత‌ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డంతోపాటు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని, స‌భ హుందాత‌నాన్ని కాపాడాల‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ మాట త‌ప్ప‌ని వ్య‌క్తిత్వం, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాన్ని టెస్ట్ చేసేందుకు బీజేపీ సిద్ధ‌మైంద‌ని అంటున్నారు.

ఏపీలో బీజేపీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే నలుగురు ఎంపీలను చేర్చుకుని.. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని విలీనం చేసుకుంది. అదే దిశలో లోక్‌‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలపైనా ఫోకస్ పెట్టింది. ఏపీ టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో రెండొంతుల మంది తమతో టచ్‌‌లో ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ విష్ణు రెండు రోజుల మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికిప్పుడు జంప్‌‌ చేసేందుకు ఎనిమిది మంది సిద్ధంగా ఉన్నట్టు వారి పేర్లతో సహా ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపుదారుల పట్ల కఠినంగా ఉంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించడంతో..ఈ నేత‌లు జంప్ చేసి బీజేపీ కండువా క‌ప్పుకొన్న త‌ర్వాత జ‌గ‌న్ ఏం చేయ‌నున్నారి ప‌లువురు స‌హ‌జంగానే ఆస‌క్తిని, అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

బీజేపీ ఎత్తుగ‌డ ఫ‌లించి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరితే, ఒక‌వేళ శాస‌న‌స‌భ విలీనం అనే విధంగా కాకుండా కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే పార్టీ మారితే....స‌హ‌జంగానే టీడీపీ వారిపై స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేస్తుంది.దీంతో స‌ద‌రు జంపింగ్ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య తీసుకోవాల్సిన బాధ్య‌త స్పీక‌ర్‌పై ఉంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విష‌యంలో స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని జ‌గ‌న్ స్పీక‌ర్‌ను కోర‌గ‌ల‌రా? దాదాపు గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా తాను పోరాటం చేసిన విష‌యంలో ఇప్పుడు త‌న నాయ‌క‌త్వంలో చ‌ర్య తీసుకునే అవ‌కాశం ద‌క్కింతే జ‌గ‌న్ ఏం చేయ‌నున్నారు? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది. స్ప‌ష్టంగా చెప్పాలంటే...జ‌గ‌న్ చెప్పే మాట త‌ప్ప‌ను...మ‌డ‌మ తిప్ప‌ను, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అనేదానికి అస‌లైన ప‌రీక్ష‌ను బీజేపీ పెట్ట‌నుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English