బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్ క‌లిసిపోవాలంటున్న ఎర్ర‌న్న‌

బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్ క‌లిసిపోవాలంటున్న ఎర్ర‌న్న‌

ప్రాంతీయ పార్టీలే రాబోయే ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాయ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో వివిధ పార్టీలు త‌మ కూట‌మిల ఏర్పాటు విష‌యంలో దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో ఈ మేర‌కు స‌మీక‌ర‌ణాలు కూడా మారుతున్నాయి. అయితే, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ ఎపిసోడ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ఏపీముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఒక్క‌తాటిపైకి రావాల‌ని కోరారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. మే 23వ తేదీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి మిగిలేది మూడు నామాలేనని ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలో లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరం అన్నారు. దీని కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త‌ద్వారా మూడు భిన్నధ్రువాల‌ను ఒక్క‌చోటుకు చేర్చే ప్ర‌తిపాద‌న చేశారు.

సీబీఐ, ఆర్బీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టిందని నారాయ‌ణ‌ ఆగ్రహం వ్యక్తం  చేశారు. నెలకు మేకప్‌ కోసం రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్న మోడీ చాయ్ వాలానా? అంటూ నారాయణ ప్రశ్నించారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత నరేంద్ర మోడీ ఇక సినిమాల్లో నటించాల్సిందేనని ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మోడీ హావ‌భావాలే ఆయ‌న ఓట‌మికి అద్దం ప‌ట్టాయ‌ని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English