మోడీని ఫాలో అయితే ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వ్ రాహుల్!

మోడీని ఫాలో అయితే ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వ్ రాహుల్!

ఒక‌రిని వేలెత్తి చూపించే వేళ‌.. నాలుగు వేళ్లు మ‌న‌ల్ని చూస్తేనేఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. మోడీ చెప్పే మాట‌ల‌న్ని మాయ అని విమ‌ర్శించే వేళ‌.. అలాంటి విమ‌ర్శ‌ల్ని సంధించే నేత‌లంతా మ‌రెంత జాగ్ర‌త్త‌గా ఉండాలి.  మోడీని త‌ప్పు ప‌ట్టే క్ర‌మంలో రాహుల్ లో దూకుడు లేద‌న్న అసంతృప్తి కాంగ్రెస్ తో పాటు.. వారి మిత్ర‌ప‌క్షాల్లో నెల‌కొంది.

అంద‌రిలో నెల‌కొన్న అసంతృప్తిని త‌గ్గించాల‌ని భావించారో కానీ అవ‌స‌రానికి మించిన అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించారు. మోడీకి తానేమీ తీసిపోన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన రాహుల్ త‌ప్పులో కాలేసి.. న‌వ్వులు పాలైన ప‌రిస్థితి. ప్ర‌ధాని మోడీ మాట‌ల‌న్ని ప‌చ్చి అబ‌ద్ధాల‌ని చెప్పే వేళ‌.. తాను అలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయారు రాహుల్.

మోడీవ‌న్ని త‌ప్పులేన‌ని.. ఆయ‌న అదే ప‌నిగా అస‌త్యాల్ని చెబుతున్న వేళ‌. మోడీలై అనే ప‌దాన్ని రాహుల్ సృష్టించారు. తాను క్రియేట్ చేసిన ప‌దాన్ని ఆక్స్ ఫ‌ర్డ్ నిఘంటువులో టైప్ చేస్తే ఇలా వ‌స్తుంద‌ని చెబుతూ.. ఒక ఫోటోను పెట్టారు. అందులో.. ఆంగ్ల నిఘంటువులో కొత్త ప‌దం చేరింది. ఆ ప‌దానికి సంబంధించిన అర్థాన్ని ఇక్క‌డ జ‌త చేస్తున్న‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. అందులో మోడీలై అన్న ప‌దం.. దానికి ప‌దే ప‌దే స‌త్యాల్ని వ‌క్రీక‌రించే వ్య‌క్తి అన్న అర్థం ఉంది.

రాహుల్ పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆయ‌న కోరుకున్న‌ట్లే అంతో ఇంతో ఇమేజ్ వ‌చ్చింది. ఇంత వ‌ర‌కూ ఓకే కానీ.. ఇక్క‌డే డ్యామిట్  క‌థ అడ్డం తిరిగిన‌ట్లైంది. మోడీలై అనే ప‌దాన్ని కొత్త‌గా చేర్చిన‌ట్లు చూపిస్తున్న ఫోటో న‌కిలీద‌ని.. అది నిజం కాద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ నిఘంటువు స్పందించింది. నిజానికి వారి నుంచి ఇలాంటి రియాక్ష‌న్ వ‌స్తుంద‌ని రాహుల్ సైతం ఊహించి ఉండ‌ద‌రు. దీంతో.. స‌త్యాన్ని ప‌దే ప‌దే వ‌క్రీక‌రిస్తార‌ని చెప్పే మోడీని విమ‌ర్శించే వేళ‌.. న‌కిలీ ఫోటోతో రాహుల్ చేసిన విమ‌ర్శ‌ను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మోడీ త‌ప్పుల్ని ఎత్తి చూపేందుకు మ‌రో త‌ప్పు రాహుల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేలా ఎవ‌రో ఒక‌రు చెబితే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English