వాస్తు ప్ర‌కారం ఏపీ సీఎం ఎవ‌రో చెప్పిన ప్ర‌ముఖ సిద్ధాంతి

వాస్తు ప్ర‌కారం ఏపీ సీఎం ఎవ‌రో చెప్పిన ప్ర‌ముఖ సిద్ధాంతి

నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన ఏపీ ఎన్నిక‌లు ముగిసాయి. ఓట‌ర్లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. ఇక‌.. ఫ‌లితాలు వెలువ‌డ‌ట‌మే మిగిలి ఉంది. అయితే.. దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మాత్ర‌మే ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అందుకోసం మే 23 వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇలాంటివేళ అనేక అంచనాలు.. ఊహాగానాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ముఖ వాస్తు సిద్ధాంతి కొమ్మినేని మ‌ల్లేశ్వ‌ర‌రావు ఏపీ ఫ‌లితం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. గ‌డిచిన పాతికేళ్లుగా తాను రాజ‌కీయాల మీద ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాన‌ని.. వాస్తు దోషాల కార‌ణంగా నేత‌లు పులువురు అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డిన వైనాన్ని ప్ర‌స్తావించారు.

వాస్తు శాస్త్రం ఆధారంగా చేసుకొని తాను స‌ర్వే చేశాన‌ని.. చంద్ర‌బాబే ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి అని పేర్క‌న్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. వాస్తులో చోటు చేసుకున్న లోపాల కార‌ణంగానే ఏన్టీఆర్ ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. జూబ్లీహిల్స్ లోని ఇంటికి ఉన్న వాస్తు లోపం కార‌ణంగానే ఎన్టీఆర్ అనేక ఇబ్బందులు ఎదురైన‌ట్లు చెప్పారు.

వాస్తులో కొన్ని అద్భుత‌మైన విష‌యాలు ఉన్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏపీకి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబే గెలుపొందుతార‌ని.. ఆయ‌నే మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవుతార‌ని స్ప‌ష్టం చేశారు. కొమ్మినేని మ‌ల్లేశ్వ‌ర‌రావు సిద్దాంతిగారి జోస్యం నిజ‌మా? అబద్ధ‌మా? అన్న‌ది తేలాలంటే మే 23 ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English