టికెట్ అనౌన్స్ చేశాక పోటీకి నో చెప్పి షాకిచ్చిన 'త‌మ్ముడు'!

టికెట్ అనౌన్స్ చేశాక పోటీకి నో చెప్పి షాకిచ్చిన 'త‌మ్ముడు'!

అధికార పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌టానికి ప‌డే పాట్లు అన్ని ఇన్ని కావు. విప‌రీత‌మైన పోటీ ఉన్న నేప‌థ్యంలో టికెట్ల కోసం నేత‌లు చేసే ప్ర‌య‌త్నాలు అన్నిఇన్నికావు. ఇలాంటి వేళ‌.. చేతికి వ‌చ్చిన టికెట్ ను నో అంటే నో అనే ప‌రిస్థితి ఉంటుందా? అంటే.. లేద‌నే చెబుతారు. కానీ.. క‌ర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

టికెట్ ప్ర‌య‌త్నాల్లో చివ‌రి వ‌ర‌కూ టికెట్ల రాక పార్టీలు మారిపోయే నేత‌ల్ని చూశాం. కానీ.. టికెట్ ను అధికారికంగా ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల్లోనే.. తాను పోటీ చేయ‌న‌ని చెబుతున్న తీరు అధికార పార్టీకి షాకింగ్ గా మారితే.. ఇదెక్క‌డి త‌ల‌నొప్పిరా బాబు అంటూ తెలుగు త‌మ్ముళ్లు కిందా మీదా ప‌డుతున్నారు. అధికార పార్టీ త‌ర‌ఫున టికెట్లు ఆశించే ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో టికెట్ల కేటాయింపులో కిందా మీదా ప‌డుతుంటారు. ఇలాంటి ఇబ్బందిని అధిగ‌మించి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన త‌ర్వాత పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని.. త‌న త‌మ్ముడికి టికెట్ ఇవ్వాలంటున్న శ్రీ‌శైలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓప‌క్క పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్న నేత‌ల కార‌ణంగా టీడీపీకి జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగింది. ఇలాంటి వేళ‌లో శ్రీ‌శైలం అసెంబ్లీ స్థానానికి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ రోజు (సోమ‌వారం) నుంచి నామినేష‌న్ల ఘ‌ట్టం స్టార్ట్ అయ్యింది. ఇలాంటివేళ‌.. తాను రాజ‌కీయాల నుంచి శాశ్వితంగా త‌ప్పుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన బుడ్డా సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న నిర్ణ‌యంతో అటు పార్టీలోనూ.. ఇటు కార్య‌క‌ర్త‌ల‌కు షాకింగ్ గా మారింది. టికెట్ ఖ‌రారు చేసిన త‌ర్వాత ఇలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం పార్టీకి ఎంత డ్యామేజ్ జ‌ర‌గుతుంద‌న్న ఆగ్ర‌హం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయ్యాక ఇలంటి నిర్ణ‌యం త‌ప్పేన‌ని.. అయితే.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తానీ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.  త‌న‌కు బ‌దులు త‌న సోద‌రుడికి టికెట్ ఇవ్వాల‌ని టీడీపీ అధినేత బాబును కోరుతున్నారు. శ్రీ‌శైలం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగ‌ప‌డ్డ త‌న త‌మ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాల‌న్న బుడ్డా మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ్ముడి కోసం బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేస్తున్న త్యాగం ఆయ‌న వ‌ర‌కు ఏమో కానీ.. టీడీపీ వ‌ర్గాల‌కు మాత్రం మంట పుట్టిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English