వివేకా చనిపోతే.. ‘పరవశించిన’ లోకేష్

వివేకా చనిపోతే.. ‘పరవశించిన’ లోకేష్

పబ్లిక్ మీటింగుల్లో నారా లోకేష్ ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు మాట తడబడి నవ్వుల పాలయ్యాడు. నారా లోకేష్ టంగ్ స్లిప్ అని కొడితే యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా తెలుగు ట్యూటర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకున్నా కూడా లోకేష్ మాటతీరులో గొప్ప మార్పేమీ రాలేదు. అతను తాజాగా మరోసారి నోరు జారి బుక్కయిపోయాడు. మిగతా వాటితో పోలిస్తే ఈసారి లోకేష్ టంగ్ స్లిప్ అయిన తీరు తీవ్ర విమర్శలకే దారి తీస్తోంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ నేత.. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పాపం వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయారు. పరవశించా’’ అనేశాడు లోకేష్.

అక్కడ లోకేష్ ఏం పదం వాడాలని అనుకున్నాడో ఏమో కానీ.. ‘పరవశించా’ అనే పదం ఉపయోగించడంతో సోషల్ మీడియా జనాలకు అతడిని ట్రోల్ చేయడానికి పెద్ద ఆయుధమే దొరికేసింది. లోకేష్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసే ప్రత్యర్థి పార్టీల జనాలు అతడిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మిగతా సమయాల్లో మాట తూలినా సరే కానీ.. ఎన్నికల సమయంలో, అందులోనూ సున్నితమైన వివేకా మృతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పదం వాడటంతో లోకేష్‌పై గట్టిగా ట్రోలింగ్ నడుస్తోంది. మరి మున్ముందు ప్రచారంలో లోకేష్ నోటి నుంచి ఇలాంటి ఆణిముత్యాలు ఇంకెన్ని జాలువారుతాయో చూడాలి. ఇలా మాట తూలడంలో లోకేష్ కంటే ఒక మెట్టు పైనే నిలిచే బాలయ్య సైతం ప్రచారానికి దిగుతున్న నేపథ్యంలో ఆయనేం మాట్లాడతాడో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English