వ‌రుస సెల‌వులు కూట‌మి కొంప‌ముంచుతాయా?

వ‌రుస సెల‌వులు కూట‌మి కొంప‌ముంచుతాయా?

తెలంగాణ‌లో కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. శుక్ర‌వారమే పోలింగ్‌. తెర‌ముందు ప్ర‌చార ప‌ర్వాన్ని ముగించిన అభ్య‌ర్థులు.. తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. విజ‌యం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కృషిచేస్తున్నారు.

అయితే - తెలంగాణ‌లో వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావ‌డం ఇప్పుడు పార్టీల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. గురు, శుక్ర‌, శ‌ని, ఆదివారాలు సెల‌వు దినాలు. ఈ సెల‌వుల ప్ర‌భావం ఓటింగ్ మీద‌ ప‌డొచ్చ‌ని అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో ఓటింగ్ శాతంపై ఈ సెల‌వులు ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంది. వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వు ఉంది కాబ‌ట్టి న‌గ‌రం నుంచి చాలామంది సొంతూళ్లకు వెళ్లొచ్చు. హైద‌రాబాద్ లో సీమాంధ్రులు ఎక్కువ‌. తెలంగాణ‌లోని ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చిన వారూ గ‌ణ‌నీయంగానే ఉన్నారు. వారంతా ఈ వ‌రుస సెల‌వుల‌ను వ్య‌క్తిగ‌తంగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావించి సొంతూళ్ల‌కు వెళ్తే ఓటింగ్ శాతం బాగా త‌గ్గే ఛాన్స్ ఉంది.

ఈ ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం చాలా కీల‌క‌మ‌వుతుంద‌ని ఆంధ్రా అక్టోప‌స్‌గా పేరుగాంచిన‌ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేయించిన స‌ర్వే స‌హా ప‌లు ఇత‌ర స‌ర్వేల్లోనూ తేలింది. ఓటింగ్ శాతం త‌క్కువ‌గా ఉంటే టీఆర్ఎస్ లాభ‌ప‌డుతుంద‌ని సూచించాయి. పోలింగ్ పెరిగితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలో నాలుగు రోజుల‌ వ‌రుస సెల‌వులు కూట‌మి అభ్య‌ర్థుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. గురు, శుక్ర‌వారాల్లో ఓట‌ర్లు ఇళ్ల‌కు వెళ్ల‌కుండా చూసేందుకుగాను కొంద‌రు అభ్య‌ర్థులు స్థానిక నేత‌ల‌ను పుర‌మాయించి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English