'బాబును తొక్కాలి లేక‌పోతే మ‌నం అయిపోతాం'

'బాబును తొక్కాలి లేక‌పోతే మ‌నం అయిపోతాం'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసేందుకు భారతీయ జనతా పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసేలోగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని అన్ని రకాలుగా ఇరుకున పెట్టాలన్నది భారతీయ జనతా పార్టీ తాజా వ్యూహంగా చెబుతున్నారు.

తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఉంటుందేమోననే భయం ఆ పార్టీ అగ్రనేతల్ని వెంటాడుతోంది. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు నాయుడు మూడో కూటమి పేరుతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని, దీనిని ద్రష్టిలో ఉంచుకుని సెమీఫైనల్ గా
భావిస్తున్న ఎన్నికలకు ముందే చంద్రబాబు అండ్ కోను మరింత ఇబ్బందుల పాలు చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీని వెనుక కూడా కమల నాథుల వ్యూహమే ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు నాయుడు వేగంగా వ్యూహ రచన చేస్తున్నారు. అది సఫలం కాకుండానే చంద్రబాబు నాయుడ్ని మరింత ఇరుకున పెట్టాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.

ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులతో తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న కేంద్రం ఇక ముందు వాటిని మరింత పెంచుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు బీజేపీతో దేనిక‌యినా రెడీ అంటున్నారు.

ఆ త‌ర్వాతే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నాయకులతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంతకు ముందు వీరిని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజాఫ్రంట్ అంటూ కలిసినా ఆ కలయిక సత్పలితాలు ఇవ్వలేదంటున్నారు.దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఝలక్ తమకు కూడా ఇస్తాడేమోననే భయమేనంటున్నారు.

అలాగే గతంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలుంటాయో మాత్రం ఎవ్వరూ ఊహించలేరని అంటున్నారు. కమలనాథులు తమ దాడులను అన్ని వైపుల నుంచి ముమ్మరం చేసి చంద్రబాబు నాయుడ్ని ఊపిరాడకుండా చేస్తారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అయితే, బీజేపీతో విడిపోయిన‌పుడే వీట‌న్నింటికి సిద్ధంగా ఉండాల‌ని బాబు త‌న శ్రేణుల‌ను హెచ్చ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English